ఎంఐఎం చీఫ్ - హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. అయోధ్య సమస్య పరిష్కారానికి తాను మధ్యవర్తిత్వం వహిస్తానని ఈ మధ్యే రవిశంకర్ చెప్పిన విషయం తెలిసిందే. దీనికోసమే తాను బుధవారం అయోధ్య వెళ్లనున్నట్లు కూడా పండిట్ శ్రీ శ్రీ రవిశంకర్ ప్రకటించారు. దీనిపై స్పందించిన షియా వక్ఫ్ బోర్డు.. ఆయనకు పూర్తి మద్దతు తెలిపింది. బెంగళూరులో రవిశంకర్ ను కలిసి తమ మద్దతును బోర్డు చైర్మన్ వసీం రిజ్వి తెలిపారు. అయితే అయోధ్య సమస్య పరిష్కారానికి తాను మధ్యవర్తిత్వం వహిస్తానన్న రవిశంకర్ ఆఫర్ ను ఓవైసీ తిరస్కరించారు.
పండిట్ శ్రీ శ్రీ రవిశంకర్ మధ్యవర్తిత్వం ఓ జోక్ అని, ఈ విషయంలో ఆయనకు ఎలాంటి అధికారం లేదని ఓవైసీ తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా రవిశంకర్ ను ఓ జోకర్ గా అసద్ అభివర్ణించారు. మొఘల్ అన్న పదం సరిగ్గా పలకడానికి రానివారు కూడా వాళ్లకు సన్నిహితులమని చెప్పుకుంటున్నారని ఒవైసీ ఆరోపించారు. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా ఇప్పటికే రవిశంకర్ ఆఫర్ ను తిరస్కరించిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ముందు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన జరిమానాను కట్టండి అంటూ రవిశంకర్ కు అసద్ చురకంటించారు. యోధ్య అంశంలో మధ్యవర్తిత్వం వహిస్తానన్న ఆయన ప్రకటనకు నోబెల్ బహుమతి ఏమీ రాదని ఓవైసీ హేళన చేశారు.