సాక్ష్యాత్తు తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి ఇంటి మీద మజ్లిస్ ఎమ్మెల్యే బలాల (మలక్ పేట) దాడి చేయటం తెలిసిందే. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ ఇంటి ఎదుట ఆందోళన చేయటం.. ఒక దశలో అలీ కుమారుడు ఇంటి బయటకు వచ్చిన సందర్భంగా అతని మీద దాడి చేయటం.. అనంతరం ఇంట్లోకి దూసుకెళ్లటం.. ఆ క్రమంలో ఇంట్లో పై అంతస్తులో నుంచి కిందకు వచ్చిన ఉప ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే బలాల తోసేయటం లాంటివి చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ హోం మంత్రి నాయిని డిప్యూటీ సీఎం ఇంటికి వచ్చి పరామర్శించటం జరిగింది.
అనంతరం బలాల మీద వివిద సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 341, 448, 427, 506, 147, 149 కింద కేసు నమోదు చేశారు. బుధవారం ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరు పర్చారు. ఈ సందర్భంగా బలాలకు బెయిల్ మంజూరు అయ్యింది. రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి ఇంటి మీద దాడి చేసిన ఉదంతంలో గంటల వ్యవధిలో మజ్లిస్ ఎమ్మెల్యే బలాల బయటకు రావటం గమనార్హం.