ఎంఐఎం అధినేత‌కు అవ‌మానం.. స‌భ‌లో మోడీ నినాదాలు!

Update: 2022-11-14 07:30 GMT
హైద‌రాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీకి ఘోర అవ‌మానం జ‌రిగింది. ఆయ‌న పాల్గొన్న స‌భ‌లో భారీ ఎత్తున యువ‌త న‌ల్ల జెండాలు చూపించ‌డ‌మే కాకుండా.. మోడీ నినాదాల‌తో హోరెత్తిం చారు. దీంతో అస‌దుద్దీన్ త‌న ప్ర‌సంగాన్ని స‌గంలోనే ముగించి.. కిందికి దిగిపోయారు. ప్ర‌ధాని మోడీ సొంత రాష్ట్రం గుజ‌రాత్లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న రాజ‌కీయంగా ప్రాధాన్యం ద‌క్కించుకుంది.

ప్ర‌స్తుతం గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ఊపందుకుంది. ఈ క్ర‌మంలో ఎంఐఎం పార్టీ కూడా..కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టింది. ఈ అభ్య‌ర్థుల విజ‌యం కోసం అస‌దుద్దీన్ ఒవైసీ గుజ‌రాత్‌లోనే మ‌కాం వేశారు. అక్క‌డే ఉండి నిశితంగా ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని గ‌మ‌నిస్తున్నారు.

ఈ క్ర‌మంలో తాజాగా ఆదివారం రాత్రి ఆయ‌న సూర‌త్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే వారిష్ ప‌ఠాన్ నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చార కార్య‌క్ర‌మంలో ఒవైసీ ప్ర‌సంగించారు.

అయితే, ఆయ‌న ప్ర‌సంగం ప్రారంభించగానే..భారీ ఎత్తున చేరుకున్న యువ‌త‌.. న‌ల్ల జెండాలు చూపిస్తూ.. ప్ర‌ధాని మోడీ నినాదాల‌తో తీవ్ర గంద‌ర‌గోళం సృష్టించారు.  దీంతో ఒవైసీ ప‌దేప‌దే వారికి విజ్ఞ‌ప్తి చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని స‌జావుగా సాగ‌నివ్వాల‌ని కోరారు.

అయితే.. ఆ యువ‌త విన‌క‌పోగా.. స్టేజ్ వైపు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో ఎంఐఎం నేత‌లు.. వారిని అడ్డుకున్నారు.

ఈ క్ర‌మంలో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరు ప‌క్షాల‌ను శాంతింప జేసి.. యువ‌త‌కు స‌ర్ది చెప్పారు. అయితే, ఒవైసీ అప్ప‌టికే కారెక్కి వెళ్లిపోయారు. కాగా, ఈ ఆందోళ‌న చేసిన వారు కూడా ముస్లిం యువ‌తే కావ‌డంతో ఎంఐఎం నేత‌లు ఎవ‌రిపై నా ఫిర్యాదు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.  ఇప్ప‌టి వ‌ర‌కు అనేక రాష్ట్రాల్లో పోటీ చేసిన ఎంఐఎంకు ఇప్పుడు గుజ‌రాత్‌లో ఎదురైన ప‌రాభ‌వం మింగుడు ప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News