ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్‌కే పరిమితమైంది మజ్లిస్ పార్టీ. మిగతా రాష్ట్రాల్లో తన బలం పెంచుకోవడానికి విస్తృత ప్రయత్నాలు చేస్తున్న మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణలో హైదరాబాద్‌ను మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో ఇప్పటివరకు పోటీ చేయడానికి మొగ్గు చూపలేదు. కారణం అప్పట్లో (వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు) కాంగ్రెస్ పార్టీతో, ఇప్పుడు టీఆర్ఎస్‌తో చెలిమిని కొనసాగించడమే. అప్పట్లో వైఎస్సార్, ఇప్పుడు కేసీఆర్.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ చెప్పినట్టు, ఆయనకు ఆగ్రహం కలగకుండా చేసుకుంటూ వచ్చారు. దీంతో అసదుద్దీన్ కూడా తన పార్టీని తెలంగాణ వ్యాప్తంగా విస్తరించుకోవడానికి అవకాశం ఉన్నా ఆ పని చేయలేదు. కేవలం హైదరాబాద్ నగరం, ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయడానికే మొగ్గు చూపుతూ వస్తున్నారు.
అయితే ఈసారి మాత్రం తెలంగాణలో ముస్లిం సామాజికవర్గం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే డిమాండ్లు మజ్లిస్ పార్టీ నేతల నుంచి అసదుద్దీన్‌కు వస్తున్నాయట. తెలంగాణలో ముస్లింలు, ఇతర మైనారిటీలు బలంగా ఉన్నచోట ఎంఐఎం పోటీ చేయాల్సిందేనని మజ్లిస్ నేతలు పట్టుబడుతున్నట్టు సమాచారం. మనం పోటీ చేయకుండా ఆయా పార్టీలకు సీట్లు వదిలేయడం ఎందుకని నేతలు అసదుద్దీన్ ను ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. దీంతో ఆయన పార్టీ నేతల డిమాండ్లకు తలొగ్గినట్టు తెలుస్తోంది. దీంతో ముస్లింలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న టీఆర్ఎస్ నేతలకు వణుకు మొదలైందని అంటున్నారు.
ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో నిజమాబాద్ జిల్లాలో పోటీ చేయాలని ఎంఐఎం భావిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి వంటి చోట్ల ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఈ స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం యోచిస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేయగల స్థాయిలో ముస్లిం ఓటర్లు ఉన్నారు.
ఇప్పటికే నిజామాబాద్ అర్బన్, బోధన్‌లలో పోటీకి సిద్ధంగా ఉండాలని స్థానిక నేతలకు ఎంఐఎం పెద్దల నుంచి సంకేతాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆ రెండుచోట్లా పార్టీ కార్యక్రమాల జోరు పెంచాలని నిర్ణయించారని సమాచారం. మరోవైపు టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నా ఈ రెండు స్థానాలను తమకే కేటాయించాలని ఎంఐఎం అడిగే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో బోధన్ ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. గత రెండు పర్యాయాలుగా వీరిద్దరూ టీఆర్ఎస్ తరఫున గెలుస్తూ వస్తున్నారు.
నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 13 డివిజన్లలో గెలిస్తే.. ఎంఐఎం 16 చోట్ల గెలవడం గమనార్హం. అలాగే బోధన్ మున్సిపల్ ఎన్నికల్లో 38 వార్డులకుగాను 11 చోట్ల ఎంఐఎం విజయం సాధించింది. ఇలా రెండు నియోజకవర్గాల్లో మజ్లిస్ పార్టీ పట్టు సాధించడంతో.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్నట్టు సమాచారం.
గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ నిజామాబాద్ అర్బన్, బోధన్‌లలో టీఆర్ఎస్‌కు సపోర్ట్ చేసిందని చెబుతారు. అందుకే అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థులు ఈజీగా గెలిచారని .. ఇప్పుడు మజ్లిస్‌పార్టీ వైఖరి మార్చుకోవడంతో లెక్కలు మారిపోతాయని చర్చ సాగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.