అమ‌రావ‌తిని చూసి ఉడుక్కుంటున్నారా?

Update: 2015-10-22 05:55 GMT
అమ‌రావ‌తి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం స్టార్ట్ అయ్యింది. సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు జోరుగా సాగుతున్నాయి. అంద‌రిని ఆక‌ర్షించేలా.. ఎంట‌ర్ టైన్ చేసేలా ప‌లు సాంస్కృతి కార్య‌క్ర‌మాలు రూపొందించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన మిమిక్రీ కార్య‌క్ర‌మం అంద‌రిని విప‌రీతంగా ఆక‌ర్షించింది. వివిధ హీరోల గొంతుల్ని అనుక‌రించిన మిమిక్రీ క‌ళాకారుడు ప్రిన్స్ మ‌హేశ్‌ బాబు గొంతును అనుక‌రించే ప్ర‌య‌త్నంలో స‌టైర్లు వేయ‌టం విశేషం.

మ‌హేశ్‌ కు ముందు నాగార్జున‌.. బాల‌య్య త‌దిత‌రుల న‌టుల గొంతుల్ని అనుక‌రించినా ప్రిన్స్ పేరుతో చేసిన మిమిక్రీ అంద‌రిని విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. అరేరే.. ఏం జ‌నం వ‌చ్చారంటూ మొద‌లెట్టి.. అమ‌రావ‌తి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న‌తీరును చూసి కొంత‌మంది ఉడుక్కుంటున్నార‌ని.. కొంత‌మంది రావ‌టం లేద‌ని.. ఎవ‌రొచ్చినా రాకున్నా ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వెనుక ఉన్నారంటూ మ‌హేశ్ గొంతుతో చెప్ప‌టం గ‌మ‌నార్హం.

మ‌హేశ్ గొంతుతో.. అమ‌రావ‌తి శంకుస్థాప‌న జ‌రుగుతున్న తీరును చూసి ప‌లువురు ఉడుక్కుంటున్నార‌న్న విష‌యాన్ని చెప్ప‌టంతో పాటు.. కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాకుండా ఉండ‌టం ద్వారా అమ‌రావ‌తి ఉత్స‌వాన్ని తగ్గించాల‌న్న ప్ర‌య‌త్నాన్ని కొంద‌రు చేశారంటూ చెప్ప‌టం విశేషం. మిమిక్రీ చేయించే విష‌యంలోనూ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై పంచ్ లు విస‌ర‌టం అవ‌స‌ర‌మా అన్న మాట వినిపిస్తోంది.

Buy Bricks Online and Contribute to Amaravathi : http://amaravati.gov.in/EBRICKS/Index.aspx
Tags:    

Similar News