మినీ మ‌హానాడులు కిక్కిరిసి పోతున్నాయంటే!!

Update: 2022-07-08 04:29 GMT
ఎన్టీఆర్ శ‌త జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నిర్వ‌హిస్తున్న రాష్ట్ర వ్యాప్త మినీ మ‌హానాడుల‌కు విశేష స్పంద‌న క‌నిపిస్తోంది. ప‌లు జిల్లాల్లో నిర్వ‌హిస్తున్న మినీ మ‌హానాడుల‌కు ఇస‌కేస్తే రాల‌నంత‌గా అభిమానులు, కార్య‌క‌ర్త‌లు పోటెత్తుతున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతున్నారు. గ‌త మే 28, 29 తేదీల్లో ఒంగోలు వేదిక‌గా మ‌హానాడును నిర్వ‌హించారు. అయితే.. ఈ స్ఫూర్తిని ఏడాది పాటు కొన‌సాగించాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు.

ఈ క్ర‌మంలోనే ఎన్న‌డూ లేని విధంగా జిల్లాల్లో మినీ మహానాడులకు శ్రీకారం చుట్టారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌నే ఏకైక ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్న టీడీపీ.. దీనికి సంబంధించి యువ‌త‌ను.. ముఖ్యంగా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ముందుండి న‌డిపించాల‌ని నిర్ణ‌యించింది.

ఈ క్ర‌మంలోనే మినీ మ‌హానాడు లకు ప్రాధాన్యం ఇస్తోంది. అయితే.. ఊహించ‌ని విధంగా ఈ మినీ మ‌హానాడుల‌కు జ‌నం పోటెత్త‌డం గ‌మ‌నార్హం. తాజాగా మ‌ద‌న‌ప‌ల్లెలో నిర్వ‌హించిన మినీ మ‌హానాడుకు వ‌చ్చిన అశేష జనం.. మ‌రింత జోష్ నింపింది.

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 'ఎన్టీఆర్‌ స్ఫూర్తి- చంద్రన్న భరోసా' పేరుతో నిర్వహించిన మినీ మహానాడులో  టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు భారీగా తరలిరావడంతో మదనపల్లె జనసంద్రంగా మారింది. ఒక‌వైపు జోరున వ‌ర్షం కురుస్తున్నా.. కూడా లెక్క‌చేయ‌కుండా.. తండోప తండాలుగా అభిమానులు, కార్య‌క‌ర్త‌లు ఈ కార్య‌క్ర‌మానికి త‌ర‌లి వ‌చ్చారు. ప్ర‌తి ఒక్క‌రూ ఎంతో శ్ర‌ద్ధ‌తో చంద్ర‌బాబు ప్ర‌సంగాన్ని విన్నారు. ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాల నుంచి కూడా జ‌నం త‌ర‌లి రావ‌డంతో టీడీపీలో నూత‌నోత్సాహం నిండింది.

వాస్త‌వానికి ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో పార్టీని మరింత దూకుడుగా ముందుకు తీసుకువెళ్లాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే.. కొంద‌రు నాయ‌కులు క‌లిసివ‌స్తున్నారు. మ‌రికొంద‌రు మీన మేషాలు లెక్కిస్తున్నారు. దీంతో త‌నే న‌డుం బిగించి..

ముందుకు క‌దులుతున్న చంద్ర‌బాబుకు అభిమానులు.. కార్య‌క‌ర్త‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఈ ఊపు ఇలానేకొన‌సాగితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న అదికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. మినీమ‌హానాడుల‌ను స‌క్సెస్ చేయ‌డం ద్వారా.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు రెడ్ కార్పెట్ ప‌రుచుకోవ‌చ్చ‌న్న చంద్ర‌బాబు వ్యూహం కూడా దీనివ‌ల్ల సాకారం అవుతుంద‌ని అంటున్నారు.
Tags:    

Similar News