మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రత్యేకతే వేరు. ఆయన ఏం మాట్లాడినా ఆచితూచి వ్యవహరిస్తారు ఎక్కడా నోరు జారరు. బహుశ గతంలో ఐఆర్ ఎస్ ఉద్యోగం చేసి ఉండడమో ఏమో.. ఆయన ఎప్పుడూ చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. సబ్జెక్ట్ పరిధి దాటి ఆయన ఎక్కడా మాట్లాడారన్న టాక్ ఏపీ ప్రభుత్వ, పార్టీ వర్గాల్లో కూడా ఉంది. ఇదే ఆయనకు ప్లస్‌గా మారింది. దీంతో మంత్రి వ్యవహారంపై సీఎం జగన్ దగ్గర కూడా మంచి మార్కులు పడుతున్నాయి. తాజాగా తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ప్రజలకు-సీఎంకు మధ్య ఉన్న రెపోనేపనిచేస్తుందని అన్నారు..
తాము కేవలం జెండా మోసే కార్యకర్తలమేనని.. అంతా జగనేనని అన్నారు. ప్రజలు అభివృద్ధి చెందేలా.. అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందేలా .. జగన్ ప్రయత్నిస్తున్నారని.. ఈ క్రమంలోనే అనేక కార్యక్రమాలకు ఆయన నాందిపలికారని చెప్పుకొచ్చారు.. ఇదే తిరుపతిలో గెలుపు గుర్రం ఎక్కించడమే కాకుండా.. భారీ మెజారిటీ సైతం కట్టబెడుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నిముషాల వ్యవధిలోనే వైరల్ కావడం గమనార్హం. మంత్రికి మంచి మార్కులు కూడా పడ్డాయి.
ఇక, ఆది నుంచి కూడా ఆదిమూలపు సురేష్.. డౌన్‌టు ఎర్త్ అనే స్థాయిలోనే ఉన్నారు. ఆయన ఏం చేసినా.. తన పేరు చెప్పుకొనేందుకు ఇష్టపడరు. తను ఏం చేసినా.. జగన్ కనుసన్నల్లోనే చేస్తున్నానని, ఇది పార్టీ , ప్రభుత్వ కార్యక్రమమని ఆయన ప్రచారం చేసుకుంటారు. ప్రతి ఒక్క పని కూడా జగన్ ఆదేశాల మేరకు నడుచుకుంటున్నామని చెప్పుకోవడం రివాజుగా మారింది.
కానీ, చాలా మంది మంత్రులు జగన్‌ను పైకి పొగుడుతున్నా... లోలోపల మాత్రం తమ హవా సాగిస్తున్నారు..కానీ.. సురేష్ విషయంలో మాత్రం ఈ తరహా రాజకీయాలు లేక పోవడం గమనార్హం. అందుకే ఆయనను చూసిపార్టీలోని సీనియర్లు సైత మురిసిపోతుండడం గమనార్హం.