విశాఖ జిల్లాలో వైసీపీకి ఏకైక మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు భవిష్యత్తు మీద అనుచరుల్లో బెంగ స్టార్ట్ అయిపోయింది. ముందుగా చూసుకుంటే ఆయనకు మంత్రి పదవి ఉంటుందా లేదా అన్నదే టాపిక్. మంత్రిగా అవంతి జిల్లాలో రెండున్నరేళ్ల కాలంలో చూపించాల్సిన దూకుడు ఏ కోశానా చూపించలేదని విమర్శ ఉంది. ఇక ఆయన జిల్లాలో అధికారులను, ఇటు ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుని ముందుకు సాగలేదని కూడా అంటారు. అంతే కాదు ఆయన తన శాఖాపరంగా పురోగతి సాధించలేదు అన్న ఆరోపణలూ ఉన్నాయి.
విశాఖ టూరిజానికి హబ్. అలాంటి చోట పర్యాటక శాఖ చేపట్టిన మంత్రి అవంతి రెండున్నరేళ్ల కాలంలో ఎంతో కొంత చేసి చూపించాల్సి ఉంది. కానీ మంత్రిగా ఆయన తన మార్క్ ని చాటలేదని అంటారు. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన అల్లూరి 125 జయంతి ఉత్సవాల్లో సినీ నటుడు మోహన్ బాబు అల్లూరికి ఆ జిల్లా మంత్రిగా ఏం చేశారు మంత్రి గారూ అంటూ వేదిక మీదనే టార్గెట్ చేశారు. అది సంచలనం కూడా అయింది.
మరో వైపు చూస్తే గతంలో బీచ్ రోడ్డులో ఉన్న పర్యాటక కట్టడాలను కూలదోశారన్న చెడ్డ పేరు మాత్రం మంత్రి మూటకట్టుకున్నరని విమర్శలు ఉన్నాయి. రుషికొండ వద్ద ఉన్న రిసార్ట్స్ ని ఒక్క దెబ్బకు కూల్చేశారని టీడీపీ సహా విపక్షాలు ఇప్పటికే మండిపడుతున్నాయి. ఇక విశాఖ ఉత్సవ్ పేరిట ప్రతీ ఏటా వైజాగ్ లో వైభవంగా కార్యక్రమాలు సాగేవి. చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉండగా 1999 ప్రాంతంలో దీనికి శ్రీకారం చుట్టారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక మాత్రం కేవలం ఒక ఏడాది 2019 డిసెంబర్ లో మాత్రమే విశాఖ ఉత్సవ్ ని నిర్వహించారు. ఆ తరువాత చేయలేదు. నిజంగా టూరిజానికి ఎంతో కొంత ఊతమిచ్చే విశాఖ ఉత్సవ్, అరకు ఉత్సవ్ వంటి వాటికి తిలోదకాలు ఇవ్వడం కూడా టూరిజం మంత్రి పనితీరు మీదనే ప్రభావం చూపుతోంది.
ఇవన్నీ ఇలా ఉంటే విశాఖ జిల్లాలో రాజకీయంగా వైసీపీని బలోపేతం చేయడంలో అవంతి అనుకున్నంతగా పనిచేయలేదని పార్టీలో ఉంది. ఆయన సొంత నియోజకవర్గం భీమిలీలో సైతం టీడీపీ లోకల్ బాడీ ఎన్నికల్లో బాగా పుంజుకుంది. ఇక ప్రత్యర్ధి పార్టీలకు ధీటుగా మీడియా వైపు నుంచి టార్గెట్ చేయడంతో కూడా మంత్రి గారు మెతగ్గా ఉన్నారని అంటున్నారు.
ఇక జిల్లాలో ఎమ్మెల్యేలు కొందరు కూడా ఆయనకు వ్యతిరేకంగా మారడంతో అవంతికి మంత్రి పదవి ఉంటుందా లేదా అన్న దిగులు అనుచరుల్లో అయితే గట్టిగా ఉందిట. మరో వైపు చూస్తే జరుగుతున్న పరిణామాల ప్రభావం వల్ల కావచ్చు మంత్రి కూడా ఈ మధ్య బాగా డల్ అయ్యారని అంటున్నారు. మొత్తానికి జగన్ మంత్రి వర్గ విస్తరణ ఎపుడు చేపట్టినా అవంతి సీటు అవుట్ అన్న టాక్ అయితే జిల్లాలో గట్టిగానే ఉంది మరి.