పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు ఉందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అంటున్నారు. ఈ విషయంపై ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పోలవరం ఎత్తు తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని పువ్వాడ అజయ్ విజ్ఞప్తి చేశారు.
పోలవరం వల్ల గోదావరి ప్రవాహం నెమ్మదిస్తోందన్నారు. పోలవరం ఎత్తు తగ్గించాలని గతంలో ఏపీ ప్రభుత్వాన్ని కూడా కోరామని గుర్తు చేశారు. ప్రస్తుతం వరదల్లో భద్రాచలం పక్కన ఉన్న ఐదు ఏపీ గ్రామాలను తెలంగాణ ప్రభుత్వమే ఆదుకుందన్నారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టి తక్షణమే ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు.
భద్రాచలం వరద నుంచి శాశ్వత పరిష్కారానికి వెయ్యి కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు. సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన వచ్చి వరద బాధితులను కలిసి ధైర్యం చెప్పారన్నారు. వరద బాధితులను ముంపు ప్రాంతాల నుంచి తరలించి శాశ్వత గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను కొనసాగిస్తున్నామని వెల్లడించారు. ఇంత వరద వస్తే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బాధితులను కలిశారా అని పువ్వాడ అజయ్ నిలదీశారు. కేంద్రం నుంచి ఎవరైనా వస్తే ఉపయోగం ఉంటుందని.. గవర్నర్ భద్రాచలంలో పర్యటిస్తే ఏం ఉపయోగమని మండిపడ్డారు.
మరోవైపు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలపై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. పోలవరం నిర్మిస్తోంది కేంద్రమని.. రాష్ట్రం కాదన్నారు. పోలవరం ఎత్తు ఎవరు పెంచారని నిలదీశారు. అంతా కేంద్ర ప్రభుత్వం చేసిన ఏపీ విభజన చట్టం ప్రకారమే జరుగుతోందన్నారు. పోలవరం వల్ల భద్రాచలానికి ముంపు ఉంటుందని ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రస్తావించారన్నారు.
ఏపీలో ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణలో కలిపేయాలన్న పువ్వాడ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అయితే హైదరాబాద్ ను ఏపీలో కలిపేయమని అడగగలమా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్ ఆదాయాన్ని ఏపీ కోల్పోయిందన్నారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలను కలిపేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు కదా కలిపేద్దామా మరి అని నిలదీశారు. పువ్వాడ అజయ్ ఇలాంటి వ్యాఖ్యలు కట్టిపెట్టి ఆయన పని ఆయన చేసుకోవాలని బొత్స మండిపడ్డారు.