తమ నిజాయితీని - పారదర్శకతను నిరూపించుకునేందుకు తెలుగుదేశం సర్కారు కొత్త ఎత్తుగడ ఎత్తింది. పోలవరం పనుల్లో రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతున్నందున.. బీభత్సంగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నందున.. వాటికి సమాధానం చెప్పడం లక్ష్యం అన్నట్లుగా.. పోలవరానికి సంబంధించిన అన్ని వివరాలూ వెబ్ సైట్లో పొందు పరిచాం అని ఏపీ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమా వెల్లడిస్తున్నారు. నిజానికి ‘వెబ్ సైట్లో ఉంచడం’ అనే పదానికి చాలా మంచి భావం ఉంది. ఆ పదమే ఒక జాతీయం లాగా భాషలోకి వచ్చేసింది. ‘వెబ్ సైట్లో ఉంచడం’అంటేనే .. మేమేమీ దాచడం లేదు.. సర్వం అందరికీ అందుబాటులో ఉంచుతున్నాం.. అనే అర్థం చెలామణీలో ఉంది.
ఇప్పుడు ఉమా కూడా అదే అర్థంలో వాడుతున్నారు. పోలవరం నిధులు ఇవ్వకుండా - రాష్ట్రప్రభుత్వం పెడుతున్న ఖర్చుల తీరు మీద సందేహాలు రేగేలాగా కేంద్రం వ్యవహరిస్తున్న తరుణంలో తాము చాలా స్వచ్ఛంగా - పారదర్శకంగా చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చుకోవడానికి దేవినేని ఉమా ఈ మాట చెప్పినట్లుగా కనిపిస్తోంది. వెబ్ సైట్లో పోలవరానికి సంబంధించిన అన్ని వివరాలూ పెట్టాం అని ఆయన అంటున్నారే తప్ప.. కనీసం దాని యూఆర్ ఎల్ కూడా చెప్పలేదు.
అయితే తమాషా ఏంటంటే.. వెబ్ సైట్ లో నిధులు కేటాయింపులు పెడతారే తప్ప.. లోపాయికారీ వ్యవహారాలు ఎందుకుంటాయి. ఇప్పుడు కేంద్రం అనుమానిస్తున్నది.. మీరు అనుసరిస్తున్న లోపాయికారీ తెరచాటు ఒప్పందాల గురించే కదా.. అని ప్రజలు సందేహిస్తున్నారు. అయినా సామాన్యుడికి సంబంధించినంత వరకూ పోలవరం వివరాలను వెబ్ సైట్లో పెట్టడం అంటే.. ఏదో వచ్చిన నిధులు, కేటాయించిన నిధులు అంటూ రెండు కేటగిరీలు పెట్టడం కాదు.
ఎప్పటిలోగా ప్రాజెక్టు పూర్తి చేయాలనుకుంటున్నారు? అప్పటిలోగా పూర్తి కావాల్సిన పనుల పరిమాణం ఎంత? అందులో కాంక్రీటు పనుల పరిమాణం ఎంత? మట్టి తవ్వకం పనుల పరిమాణం ఎంత? ప్రస్తుతం గత వారం రోజుల వ్యవదిలో జరిగిన పని పరిమాణం ఎంత ఇలాటి వివరాలను అన్నిటినీ కూడా సమగ్రంగా వెబ్ లో పెడితే.. ప్రజలే తెలుసుకోగలరు. అప్పుడిక కేవలం నిధుల విషయంలో మాత్రమే కాదు.. పనుల విషయంలో కూడా ప్రజలకు పారదర్శకత ఉంటుంది. ప్రభుత్వం ఇదిగో అయిపోతున్నది.. అదిగో చేసేస్తున్నాం.. 2018 డిసెంబరు నాటికి - 2019 ఎన్నికల నాటికి పూర్తయిపోతుందని ఒకసారి, గ్రావిటీతో నీళ్లు ఇవ్వగలం అని ఒకసారి.. ఇలా రకరకాలుగా మాటలు మార్చడానికి ఆస్కారం లేకుండా ఉంటుంది.