గుడివాడ.. ఉమ్మడి ఏపీలో "పేరు"గాంచిన ఊరు. మున్సిపాలిటీగా.. రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతంగా గుడివాడ పేరు మార్మోగింది. అన్నింటికీ మించి.. మహా నటుడు, దివంగత
సీఎం, తెలుగువారి ఆత్మగౌరవ పతాకం నందమూరి తారక రామారావు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం.
అందుకే గుడివాడ అంటే ఉమ్మడి ఏపీలో మంచి పేరు. అయితే, మన తెలుగు రాష్ట్రాల్లో ఊరి పేరు కొందరికి ఇంటి పేరుగా ఉండడం సహజం. కొన్ని ప్రాంతాల్లో అయితే.. ఇంటి పేరు స్థానంలో ఊరి పేరు చేరినవారున్నారు. ఇది చాన్నాళ్లుగా వస్తున్న ఆచారంగా మారిపోయింది కూడా. అందుకే.. "పేరులో నేముంది?"అనేకంటే "ఇంటి పేరులో నేముంది?" అని పాడుకోవాలి ఇప్పడు. ఈ విషయం అంతా ఎందుకంటే...
ఏపీ మంత్రికి మళ్లీ పేరు తిప్పలు ఏపీలో యువ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు పేరు విషయంలో భలే తిప్పలు ఎదురవుతున్నాయి. ఈ విషయమై ప్రతిసారి వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల గుడివాడ అమర్నాథ్ రెడ్డి అంటూ ఆయనను సంబోధించడం చర్చనీయాంశమైంది. అదికూడా అపాచీ వంటి పెద్ద పరిశ్రమ ప్రారంభోత్సవ సందర్భంగా జరిగింది. దీంతో ఇలా చేయొద్దంటూ మరోసారి మీడియా
సమావేశం పెట్టి మరీ కోరారు. అయితే, అనుకోని రీతిలో ఆయనకు ఈసారి ఇంటి పేరు ఉచ్ఛారణలో విచిత్ర పరిస్థితి ఎదురైంది.
గుడివాడను గోవిందాగా పలికిన జపాన్ కాన్సుల్ తెలుగు రాష్ట్రాల్లో "గుడివాడ" పేరు ఎంత పాపులరో.. తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి "గోవింద" నామస్మరణ కూడా అంతే స్థాయిలో పేరుగాంచింది. కోట్లాదిమంది భక్తులు గోవింద.. గోవింద అంటూ తన్మయత్వంతో చేసే నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగుతుంటాయి. కాగా, మంగళవారం విశాఖపట్నంలో ఏటీసీ సంస్థలో ఓ యూనిట్ ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో చిత్రమైన సన్నివేశం చోటుచేసుకుంది. వేదికపై ఉన్న అందరూ బాగానే ప్రసగించింది.. జపాన్ కాన్సుల్ జనరల్ టాగా మసయుకీ చేసిన ఓ ఉచ్ఛారణ ప్రస్తావనార్హమైంది.
మంత్రి గుడివాడ అమర్నాథ్ అంటూ సంబోధించబోయి 'గోవిందా అమర్‌నాథ్' అని పలికారు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. దీనికి మంత్రి కూడా స్పందించినట్లు కనిపించింది. ఆ సమయంలో ఆన తన పక్కనే ఉన్న యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు చెవిలో ఏదో చెబుతూ కనిపించారు.