దుమారం రేపిన మంత్రి హ‌రీశ్‌రావు.. కేసీఆర్‌ను బ‌య‌ట‌కు లాగిన ఏపీ మంత్రి

Update: 2022-10-01 04:34 GMT
తెలంగాణ మంత్రి హ‌రీశ్‌రావుపై ఏపీ అధికార పార్టీ నేత‌లు తీవ్ర‌స్థాయి విరుచుకుప‌డ్డారు. ఇప్ప‌టికే కీల‌క స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి.. నువ్వొక‌టంటే..మేం నాలుగు అంటాం. అలా అనేల‌నే.. మీరు ఇలా మాట్లాడుతున్నారు.. అని వ్యాఖ్యానించారు. మీప‌నిమీరు చూసుకుంటే బెట‌ర్‌.. అని స‌ల‌హా ఇచ్చారు. ఇక‌, మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ అయితే.. తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి హరీశ్‌రావుకు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గొడవలుంటే వాళ్లు వాళ్లు చూసుకోవాలే కానీ.. ఏపీపై విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు.

హరీశ్‌రావు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి.. ఎనిమిదేళ్లుగా తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్ ఎస్‌ను చూసి నేర్చుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి తమకు లేదని  అమర్‌నాథ్‌ అన్నారు.  ఉపాధ్యాయులపై మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి.. తెలంగాణకు ఎనిమిదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్‌ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. హరీశ్‌రావు జగన్‌ను తిడితే.. మేం ఇక్కడ కేసీఆర్‌ను తిడతాం అది చూసి హరీశ్‌ హ్యాపీగా ఫీలవుదామన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.

ఏపీలో ఉన్న పేదలకు ఎలాంటి సంక్షేమం అందుతుందో, ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుందో ఒక్కసారి వచ్చి చూస్తే తెలుస్తుందని అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణలో జరిగిన సంక్షేమం, వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఏపీలో జరిగిన సంక్షేమం గురించి చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల కేటీఆర్‌ ఉదయం విమర్శ చేసి రాత్రికి వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. ఏపీ భవన్‌లో అధికారిని హరీశ్‌రావు ఎలా తన్నారో అందరూ చూశారని మంత్రి అమర్‌నాథ్‌ అన్నారు.

అస‌లు ఏం జ‌రిగింది? ఉపాధ్యాయుల పట్ల ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని మంత్రి హరీశ్‌ రావు గురువారం వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వానికైనా వంద శాతం పనులను పూర్తి చేయడం సాధ్యం కాదన్నారు. ఏపీలో ఉపాధ్యాయులపై కేసులు పెట్టి ఎలా లోపల వేస్తున్నారో.. టీఆర్ ఎస్‌ ప్రభుత్వం ఎంత ఫ్రెండ్లీగా ఉందో గమనించాలని సూచించారు. దేశంలోనే 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన ఘనత తెలంగాణదని కొనియాడారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News