దేశంలో చాలానే రాష్ట్రాలు ఉన్నా.. తెలంగాణ రాష్ట్రం కాస్తంత డిఫరెంట్. ఇక్కడి రాజకీయ నేతలు కూడా మిగిలిన వారికి కాస్తంత భిన్నంగా వ్యవహరిస్తుంటారు. పట్టించుకోనంత కాలం పెద్దగా పట్టనట్లుగా ఉంటారు కానీ.. ఒక్కసారి యుద్ధం డిసైడ్ అయినట్లుగా ఫిక్సు అయితే చాలు.. ఇప్పటివరకు ఎవరూ లేవనెత్తని వాదనల్ని తెర మీదకు తీసుకొచ్చేయటమే కాదు.. దానికి సంబంధించిన లాజిక్కులు చెప్పి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటారు. ఉద్యమ నాయకులుగా సుదీర్ఘకాలం పాటు సొంత రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమ టీఆర్ఎస్ నేతలు బీటీ బ్యాచ్ కు చాలా భిన్నమనే చెప్పాలి.
అధికారం చేతికి వచ్చినా.. లెక్కలు తేడా వస్తే.. తమలోని ఉద్యమకారుల స్ఫూర్తి చప్పున బయటకు వస్తుందన్న చందంగా వ్యవహరిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీపై ఘాటు వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఏ చిన్న అవకాశాన్ని విడిచి పెట్టకుండా మంత్రి కేటీఆర్ వరుస పెట్టి కేసును బిల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు వారిద్దరికి తోడుగా తెర మీదకు వచ్చారు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు. బీజేపీ వర్సస్ టీఆర్ఎస్ అన్నట్లు సాగుతున్న వార్ లోకి ఆయన తాజాగా ఎంట్రీ ఇచ్చారు.
తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణలో పర్యటిస్తూ.. రేషన్ దుకాణాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఉండాలని వ్యాఖ్యానించటం.. కేంద్రం నిధులు ఇస్తున్నప్పటికీ దానికి తగ్గట్లుగా రాష్ట్రం రియాక్టు కావట్లేదని.. కేంద్ర ప్రభుత్వ పథకాల్ని తమ పథకాలుగా మారుస్తున్నారంటూ ఘాటు విమర్శలతో పాటు.. ఆరోపణలు చేశారు. ఇలాంటి వేళ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు తెర మీదకు వచ్చారు. రేషన్ దుకాణాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోతో పాటు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోను కూడా పెట్టాలన్న కొత్త వాదనను వినిపించారు.
తాజాగా మెదక్ లో మాట్లాడిన ఆయన.. తన వాదనలో ఉన్న లాజిక్ ఏమిటో వెల్లడించారు. ‘దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. రాష్ట్రం నుంచి కేంద్రానికి డబ్బులు ఇస్తున్నాం. రాష్ట్రం నుంచి రూ.3.65 లక్షల కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తున్నాం. కేంద్రానికి రాష్ట్రం నుంచి వెళ్లే సొమ్ము ఎక్కువ. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే ఆదాయం తక్కువ. కేంద్రాన్ని.. కొన్ని రాష్ట్రాల్ని సాకటంలో తెలంగాణ ప్రభుత్వ వాటా ఉంది. రాష్ట్ర ప్రజల సంపద ఉంది. మరి.. ఆయా రాష్ట్రాల్లో తెలంగాణ ప్రతినిధి.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోను మీరు పెట్టండి’ అంటూ తన డిమాండ్ వెనుకున్న లాజిక్ అస్త్రాన్ని బయటకు తీశారు.
కేంద్రం మాట్లాడినట్లేతాము కూడా మాట్లాడగలమని.. వారు మాట్లాడేవన్నీ అసత్యాలు.. అర్థ సత్యాలుగా అభివర్ణించారు. తాము మాట్లాడేవన్ని నగ్న సత్యాలుగా చెప్పిన హరీశ్.. ‘ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయటం సరికాదు. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర పెద్దలు అబద్ధాలు మాట్లాడి వెళ్లిపోతున్నారు. పట్టపగలు పచ్చి అబద్ధాలు మాట్లాడే పార్టీ బీజేపీ’ అని వ్యాఖ్యానించారు.. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. హరీశ్ మాష్టారి కొత్త లాజిక్ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో అస్త్రంగా మారి.. కేంద్రం మీద ప్రయోగించటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.