వరదల వేళ కేంద్రమే కాదు.. మనం కూడా తక్కువ తినలేదుగా కేటీఆర్?

Update: 2022-07-16 09:30 GMT
నచ్చినప్పుడు ఏం చేసినా బాగానే ఉంటుంది. తేడా వచ్చినప్పుడే ఏం చేసినా.. అందులో లోపాలే కనిపిస్తూ ఉంటాయి. ప్రతి మనిషిలో ఉండే ఇలాంటి లక్షణం.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏలే మంత్రి కేటీఆర్ లోనూ ఉండటం చూసినప్పుడు.. ఆయన కూడా కొన్ని విషయాల్లో మిగిలిన వారిలానే ఆలోచిస్తారన్న భావన కలుగక మానదు. వరుస పెట్టి ఆరేడు రోజులు దంచి కొట్టిన వానలతో తెలంగాణ రాష్ట్రం తడిచి ముద్ద కావటమే కాదు.. పై నుంచి వస్తున్న వరద నీరు.. రాష్ట్రంలో కురిసిన వర్షాల కారణంగా వరద పోటు మరింత పెరిగిన పరిస్థితి.

ఇలాంటివేళ.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని ప్రాజెక్టులు నీట మునక  తప్పని పరిస్థితి. గడిచిన ఎనిమిదేళ్లలో ఎప్పుడూ ఎదురుకాని పరిస్థితుల్ని కేసీఆర్ సర్కారు ఇప్పుడు ఫేస్ చేస్తోంది.ఇలాంటి సమయంలో ఫోకస్ మొత్తం వరదల మీదా..ప్రజలు పడే ఇబ్బందుల మీదా.. మునిగిన ప్రాజెక్టుల మీదనే ఉండాలి.

కానీ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూసినప్పడు..వరదల కారణంగా ఎదురవుతున్న సవాళ్లను హ్యాండిల్ చేస్తూనే.. మరోవైపు రాజకీయంగా ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించే ప్రయత్నం చేస్తోంది. అన్నింటికి మించి.. తెలంగాణలో విపక్షాల బలం పెరిగిపోతుందన్న ప్రచారానికి చెక్ చెప్పేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని మిస్ కాకుండా పని చేస్తున్నారు.

ఇలాంటి వేళ..ప్రభుత్వ ప్రాధామ్యాలు ఏమిటన్న విషయాన్ని ప్రభుత్వం తీసుకుంటున్న రోజువారీ నిర్ణయాలతో ఇట్టే అర్థమయ్యే పరిస్థితి. అలా అందరికి అన్ని అంశాల మీద అవగాహన వస్తున్న వేళలో..కేంద్రంలోని మోడీ సర్కారు మీద డైలీ బేసిస్ లో ఫైర్ అవుతున్న మంత్రి కేటీఆర్.. కొన్ని అంశాల్ని మిస్ అవుతున్నారు.దీంతో..ఆయన మాటల్నివేలెత్తి చూపించాల్సిన పరిస్థితిని తరచూ తెచ్చుకుంటున్నారు.

శుక్రవారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. కేంద్రంలోని మోడీ సర్కారును తిట్టే అవకాశాన్ని వదులుకోలేదు. అంతేకాదు.. విమర్శలు చేయటానికి వెనుకాడలేదు.వర్షాలు..వరదల వేళ..కేంద్రం నుంచి వస్తున్న టీంల గురించి విమర్శిస్తూ.. "ఓవైపు తెలంగాణలో వరదలొస్తుంటే ఉపాధి హామీలోఅక్రమాలంటూ కేంద్రం టీంలను పంపింది" అంటూ తన ఆగ్రహాన్ని తెలివిగా బయటపెట్టారు. ఇలాంటి మాటలు కేటీఆర్ ఆగ్రహంలోని డొల్లతనాన్ని బయటపెట్టేస్తుంటాయి.

నిజంగానే వరదల కారణంగా తెలంగాణ మొత్తం ఆగమాగం అయిపోతుంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి అన్నీ అయిన తాము ఏం చేస్తున్నామన్న ప్రశ్నను ప్రజలు వేసుకోరా? అన్న పాయింట్ మర్చిపోతున్నారు. ఓవైపు వరదలతో సతమతమవుతుంటే.. మీడియాను పిలిచి ఇష్టాగోష్ఠిగా గంటలు మాట్లాడే అవకాశం ఉండదు కదా? చివరకు సీఎం కేసీఆర్ సైతం కాలు బయటకు పెట్టకుండా అదే పనిగా వార్ రూంలో రివ్యూల మీద రివ్యూలు చేపడుతున్నారు.

ఇదంతా చేసేటప్పుడు వరదలు.. తెలంగాణ ప్రజలు అన్న రెండు మాటలు తప్పించి కేంద్రం.. మోడీ.. విపక్షాలు.. సర్వేలు అంటూ అవసరం లేని మాటలు రాకూడదు కదా? మరి.. మంత్రి కేటీఆర్ నోటి నుంచి ఇలాంటి మాటలే తరచూ వినిపించటంలో మతలబు ఏమిటి? అన్నది ప్రశ్న. ఇదంతా చూసినప్పుడు వరదల వేళ.. కేంద్రం మీద మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు తాను చెప్పే మాటలకు కూడా సూట్ కావాలన్న విషయాన్ని మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. ఇలా చేసుడేంది కేటీఆర్?
Tags:    

Similar News