వాళ్లు గాడిద‌లైతే...రేవంత్ రెడ్డి ఎవ‌రు: మంత్రి కేటీఆర్‌

Update: 2021-09-18 11:30 GMT
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గాడిదలైతే ఆ పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడు రేవంత్‌ రెడ్డి ఎవ‌రు, అడ్డగాడిదా అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి దూకుడు రియల్ ఎస్టేట్ వెంచర్ లాంటిదని, మార్కెట్ చేసుకునే హ‌డావిడేకానీ అంత సీన్ లేదని కేటీఆర్ ఆరోపణలు చేసారు. వైఎస్‌ ఆర్‌ టీపీ అధినేత్రి షర్మిల, బీఎస్పీ నేత ప్రవీణ్‌ కుమార్‌ జాతీయ పార్టీలకు తొత్తులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని దుయ్యబట్టారు.

షర్మిల సీఎం కేసీఆర్‌ పై కాకుండా బీజేపీ, కాంగ్రెస్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని, సీఎంను నోటికొచ్చినట్లు తిడితే రాజద్రోహం కేసులు పెట్టడానికి వెనకాడమన్నారు. టీఆర్‌ ఎస్ ఓట్లు చీల్చి జాతీయ పార్టీలకు న్యాయం చేయాలని చూస్తున్నారని మండిప‌డ్డారు. బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉండే రాష్ట్రాల్లో దమ్ముంటే బీసీబంధు పెట్టాలని కేటీఆర్ స‌వాల్ విసిరారు. తెలంగాణకు నిజమైన ముక్తి రాష్ట్రం ఏర్పడటంతోనే ల‌భించింద‌ని, సాయుధ పోరాటం గురించి మాట్లాడే హక్కు భార‌తీయ జ‌న‌తాపార్టీకి లలేదని, ఆనాడు సాయుధ పోరాటం చేసింది కమ్యునిస్టులేనని కేటీఆర్ తెలిపారు.

ఇదిలా ఉంటే .. తెలంగాణ మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. వ్యాక్సినేషన్ రెండో జాబ్ డన్ అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా, అంతకుముందు కేటీఆర్ జూలై 20న కోవిడ్ టీకా మొదటి మోతాదు తీసుకున్నారు. కాగా, మొదటి డోస్ తీసుకుంటున్న క్రమంలో ఫొటోను ట్విట్టర్‌ లో షేర్ చేశారు. ప్ర‌ధానమంత్రి, కేంద్ర మంత్రులు సైతం ఆస్ప‌త్రికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకుంటే, కేటీఆర్ తాను ఇంటి ద‌గ్గ‌ర‌ వ్యాక్సిన్ వేయించుకోవ‌డం ఏమిట‌ని నెటిజ‌న్లు విమర్శలు చేస్తున్నారు. ప్ర‌జ‌లంతా వ్యాక్సిన్ దొర‌క్క ఆరోగ్య కేంద్రాల ముందు క్యూ లైన్లనో నిల్చుని నీర‌సించిపోతోంటే, మంత్రి మాత్రం ద‌ర్జాగా ఇంట్లో కూర్చొని వ్యాక్సిన్ తీసుకుంటారా అంటూ ఫైర్ అవుతున్నారు.


Tags:    

Similar News