కేటీఆర్ సంతకం ఫోర్జరీ.. కలకలం

Update: 2019-10-04 07:20 GMT
ఉన్నత పోస్టు కోసం ఓ మహిళా ప్రధానోపాధ్యాయురాలు చేసిన పని ఇప్పుడు ఆమెను చిక్కుల్లో పడేసింది.ఆమె ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. ఏకంగా కేటీఆర్ సంతకాన్నే ఫోర్జరీ చేసిన వైనం ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.

నల్గొండ జిల్లా రావులపెంట ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా మంగళ పనిచేస్తోంది. ఆమె జిల్లా కోఆర్డినేటర్ పోస్టు కోసం ప్రయత్నిస్తోంది. ఎంత లాబీయింగ్ చేసినా వర్కవుట్ కాలేదు. దీంతో ఏకంగా మంత్రి కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసింది.  మంత్రి కేటీఆర్ రికమండేషన్ లెటర్ తో జిల్లా కోఆర్డినేటర్ పోస్టు తనకు ఇవ్వాలని ఉన్నతాధికారులను సంప్రదించింది.

వారికి అనుమానం వచ్చి ఆ లెటర్ ను కేటీఆర్ కు పంపారు. మంత్రి ఈ సంతకం తాను చేయలేదని.. ఎలాంటి రికమండేషన్లు తాను చేయలేదని సీరియస్ గా రియార్ట్ అయ్యారు. తన సంతకాన్నే ఫోర్జరీ చేసిన హెచ్ఎంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇలా ఉన్నత స్థాయి పోస్టు కోసం అడ్డదారులు తొక్కిన ప్రధానోపాధ్యాయురాలు ఇప్పుడు ఉన్న పోస్టును కూడా కోల్పోయే ప్రమాదంలో పడింది.
Tags:    

Similar News