తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడూ హుషారుగా ఉంటారు. ఆయన ఏం చేసినా..? ఏది మాట్లాడినా సంచలనమే. ప్రజల్లోకి ఉత్సాహంగా వెళుతూ ఆయన చేసే సందడి డ్యాన్సులు అందరినీ ఆకట్టుకుంటాయి. తాజాగా మాట్లాడిన మల్లారెడ్డి మరోసారి కేసీఆర్ పై తన ప్రేమను చాటుకున్నారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఒకసారి దేశానికి ప్రధాని కావాలి’ అని డిమాండ్ వినిపించింది.
2024లో ప్రధాని కేసీఆర్ యేనని స్పష్టం చేశారు. 2024లో తమ పార్టీ దేశవ్యాప్తంగా విజయఢంకా మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎర్రకోట మీద ప్రధాని హోదాలో కేసీఆర్ జెండా ఎగురవేస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రతిపక్షానికే పరిమితం అవుతుందని వివరించారు. కాంగ్రెస్ దిగజారుతుందని.. టీఆర్ఎస్ విజయం తథ్యం అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఆటలు ఇక సాగవని.. హైదరాబాద్ లో ఆ పార్టీలను తరిమికొడుతామని తెలిపారు. తమ పార్టీ ఆదరణ మరింత పెరుగుతుందని తెలిపారు. 2024 ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని అన్నారు.
తెలంగాణలో వెయ్యి గురుకులాలు ఉన్నాయని.. దేశంలో ఎక్కడా తెలంగాణ లో ఉన్నన్ని లేవని మల్లారెడ్డి అన్నారు. ఈ ఘనత కేసీఆర్ కు దక్కుతుందని వివరించారు. మరే రాష్ట్రం ఇలా విద్య కోసం పథకాలు ప్రవేశపెట్టలేదని తెలిపారు. ఒక్క తెలంగాణలో అమలవుతున్నాయని పేర్కొన్నారు.
ఇదివరకు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి మల్లారెడ్డి ఈ మేరకు ఇప్పటికే తన ఆకాంక్షను బయటపెట్టాడు. కేసీఆర్ ప్రధానమంత్రి అయితే ప్రజలకు సమస్యలే ఉండవని చెప్పుకొచ్చారు. జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న వారు చిన్నప్పటి నుంచి అవే పథకాలు రన్ చేస్తున్నారని.. ఏదో మభ్యపెట్టి కాలం గడుపుతున్నారని మల్లారెడ్డి పేర్కొన్నారు. 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసిందని మల్లారెడ్డి ప్రశ్నించారు. ఏడు సంవత్సరాల్లోనే కేసీఆర్ తెలంగాణలో చరిత్ర సృష్టించాడని పేర్కొన్నారు.రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వైద్యం అందించిన వ్యక్తం కేసీఆర్ అని ప్రశంసించారు.
దేశం చూపు తెలంగాణ వైపు ఉందని.. అందుకే కేసీఆర్ ను పీఎంను చేయాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ఒక్కసారి పీఎం అయితే అన్ని రాష్ట్రాల్లో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని ఆయన పేర్కొన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.