కాలు ఎత్తటం ఏమిటి? జారి పడటం ఏమిటి? ఏంది మల్లారెడ్డి ఇదంతా?

Update: 2021-03-31 04:37 GMT
తెలంగాణ రాష్ట్ర మంత్రుల్లో అత్యంత ఉత్సాహవంతుడు.. వయసు మీద పడినా.. కుర్రాడిలా చెలరేగిపోయే విలక్షణత మంత్రి మల్లారెడ్డి సొంతం. తనకున్న పదవిని పట్టించుకోకుండా.. ఎప్పటికప్పుడు తానేం అనుకుంటారో అది మాత్రమే చేసిన ఆయన.. తరచూ తన మాటలతో.. చేతలతో వార్తల్లోకి వస్తుంటారు. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. ఆయన ఉత్సాహం ఆయన్ను ఇబ్బందుల్లోకి గురి చేసింది.

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 68వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళా.. పురుషులు కబడ్డీ పోటీలు జరిగాయి. ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. క్రీడాకారుల్ని ఉత్సాహ పరిచేందుకు.. సరదాగా కబడ్డీ కోతకు వెళ్లారు మంత్రి. ఉత్సాహంతో కాలు పైకి లేపి.. ప్రత్యర్థులపై దూసే ప్రయత్నం చేశారు. ఇక్కడో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

కాలు ఎత్తిన మల్లారెడ్డి.. బ్యాలెన్స్ తప్పి కింద పడ్డారు. మంత్రివారు అలా కిందకు పడిపోవటంతో.. ఒక్కసారిగా అందరూ వచ్చి ఆయన్ను పైకి లేపే ప్రయత్నం చేశారు. దెబ్బ కాస్త బలంగా తాకినప్పటికీ ఆయన మాత్రం నవ్వుతూ.. పోటీల్ని కొనసాగించాలని కోరారు.కబడ్ఢీ పోటీలు షెడ్యూల్ ప్రకారం సాగాయి. కాలు నొప్పిగా ఉండటంతో మంత్రి మల్లారెడ్డి ఆసుపత్రికి వెళ్లి.. పరీక్షలు చేయించుకున్నారు. ఉరకలు వేసే ఉత్సాహం మంచిదే కానీ వయసును కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా మల్లారెడ్డి సారూ?
Tags:    

Similar News