పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - విలక్షణ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబోలో తెరకెక్కిన `అజ్ఞాతవాసి`చిత్రం కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సంగతి తెలిసిందే. విడుదలకు ముందే భారీగా హైప్ వచ్చిన ఈ మూవీ నేడు రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదలైంది. ఈ చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ని బట్టి ఇది నాన్ బాహుబలి రికార్డులను బద్దులు కొడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ చిత్రాన్ని తొలిరోజే చూసేందుకు కొంతమంది టాలీవుడ్ యువ హీరోలు - సెలబ్రిటీలు కూడా రెడీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు....ఈ చిత్రాన్ని తాడేపల్లి గూడెంలో నేడు ఉదయం వీక్షించారు. ఈ విషయాన్ని మాణిక్యాల రావు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాంతోపాటు థియేటర్లో సినిమా వీక్షిస్తున్న ఫొటోలను పోస్ట్ చేశారు. అంతేకాకుండా, పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.
2014లో బీజేపీ - టీడీపీ లకు మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర తేల్చి చెప్పిన తర్వాత పవన్ ...బీజేపీపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పవన్...బీజేపీకి కొద్దిగా దూరంగా ఉంటున్నారు. అయితే, సందర్భానుసారంగా పవన్ కల్యాణ్ పై తమకున్న అభిమానాన్ని చాటుకునేందుకు బీజేపీ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నేతల స్నేహ హస్తాన్ని పవన్ అందుకుంటారా లేదా అన్నది తేలాల్సి ఉంది. మరి, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి పవన్ మద్దతు ఇస్తారా...ఇవ్వరా అన్న అంశం ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు.