కొడాలి ఇంటికి దారెటు... నియోజ‌క‌వ‌ర్గం టాక్ బ్రో..!

Update: 2022-12-20 16:30 GMT
ఆయ‌న ఫైర్ బ్రాండ్‌. నోరు విప్పితే ప్ర‌తిప‌క్షాల‌పై తీవ్ర‌మైన వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డుతుంటారు. ఇక‌, త‌న‌కు నియోజ‌క‌వ‌ర్గంలో ఎదురు లేద‌ని కూడా బావిస్తారు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న ఆయ‌నే మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. అయితే.. ఆయ‌న‌కు ప్ర‌త్య‌క్షంగా ఎదురు లేద‌ని ఆయ‌న చెప్పుకోవ‌డం త‌ప్పుకాదు. కానీ, క్షేత్ర‌స్థాయిలో మాత్రం ఆయ‌న‌కు కూడా భారీ వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది.

ఇటీవ‌ల కొన్ని మీడియా చానెళ్లు.. ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రించాయి. ఎమ్మెల్యే  నానిపై ప్ర‌జ‌ల అభిప్రాయం తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశాయి. నేరుగా ప్ర‌జ‌లు నానిపై ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌లేదు.. కానీ, త‌మ‌కు ఏమీ ప్ర‌యోజ‌నం ల‌భించ‌లేద‌ని మాత్రం కూల్‌గా చెప్పారు. "మంత్రిగా ఉన్న‌ప్పుడు.. ఏదో చేస్తార‌ని అనుకున్నాం. కానీ, ఆయ‌న ఇబ్బందులు ఆయ‌న‌కు ఉన్నాయి. ఏం చేస్తాం" అని చాలా మంది వ్యాఖ్యానించారు.

మ‌రికొంద‌రు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మార్పు కోరుకుంటున్నారా ? అన్న ప్ర‌శ్న‌కు.. త‌ప్పేముంది ?  రాష్ట్రంలో ప్ర‌భుత్వం మారాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటే ఇక్క‌డ కూడా అదే జ‌రుగుతుంది. అని ముక్త‌స‌రిగా ఎటూ తేల్చ‌కుండా స‌మాధానం చెప్పారు. ఇత‌మిత్థంగా మంత్రి నాని వ్యాఖ్య‌లు ఇక్క‌డ పెద్ద‌గా ప‌నిచేయ‌డం లేదు. త‌మ‌కు అందుబాటులో లేరని చెప్పిన వారు ఎక్కువ‌గా ఉన్నారు. ఆయ‌న ఇంటికి వెళ్లాలంటే.. దారి తెలియ‌ద‌ని అన్న‌వారు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఇంకో విశేషం.. ఏంటంటే.. ఆయ‌న అనుచ‌రులుగా ఉన్న కొంద‌రు... ఇప్పుడు త‌మ సొంత ప‌నులు చేసుకుంటున్నార‌ని తెలియ‌డమే. అంటే.. నాని అనుచ‌రుల‌కు.. కూడా సంతృప్తి లేకుండా పోయింద‌నే వాద‌న ఉంది. నాని సోద‌రుడు వీరిని మెయింటెన్ చేస్తున్నారు. అయితే, కొన్నాళ్లుగా ఆయ‌న బిజీగా ఉండ‌డంతో క‌నీస ఖ‌ర్చుల‌కు కూడా ఇబ్బంది ప‌డుతున్న‌వారు..రోజు వారీ ప‌నుల‌కు వెళ్లిపోతున్నారు. ఇది వ్య‌తిరేక‌త‌తో కాదు కానీ, మార్పు అయితే వ‌చ్చింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News