అతి వేగంతో కారును నడిపి.. మెట్రో ఫిల్లర్ ను బలంగా ఢీ కొట్టిన ఘటనలో మరణించిన ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ అంత్యక్రియ సందర్భంగా చోటు చేసుకున్న ఒక కార్యక్రమం అందరిని కంటతడి పెట్టేలా చేసింది. ఉన్నత విద్యను పూర్తి చేసి నారాయణ సంస్థల డైరెక్టర్ గా బాధ్యతల్ని స్వీకరించిన కొద్ది కాలానికే నిషిత్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవటంపై నారాయణ సంస్థల ఉద్యోగులు తీవ్రంగా తల్లడిల్లిపోతున్నారు. నిషిత్ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి చేసి బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక వాహనంలో నెల్లూరుకు తరలించిన వైనం తెలిసిందే.
అదే రోజు రాత్రి 7.30 గంటలకు నెల్లూరులోని నారాయణ వైద్య కళాశాల ప్రాంగణంలోకి మృతదేహాన్ని తీసుకొచ్చారు. పలువురు ప్రముఖులు.. పెద్ద ఎత్తున ప్రజలు నిషిత్ భౌతికకాయాన్ని చూసి విలపించారు. గురువారం ఉదయం అంత్యక్రియ కార్యక్రమాన్ని మొదలెట్టారు.
నిషిత్ పార్థిప దేహాన్ని ఇంటి నుంచి తీసుకెళ్లి స్నానం చేయించి అరటి చెట్టుతో పెళ్లి చేశారు. వివాహం కాకుండా మరణిస్తే.. కర్మక్రియలు చేయటానికి ఈ విధానాన్ని కొందరు పాటిస్తారు. దీంతో నిషిత్ కు అరటిచెట్టుతో వివాహం జరిపించారు.
ఈ కార్యక్రమాన్ని చూసిన పలువురు.. ఘనంగా పెళ్లి కావాల్సిన వేళ.. ఇలా నిర్జీవంగా మారి పెళ్లి తంతు జరిపించాల్సి వచ్చిందే అంటూ రోదించటం కనిపించింది. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర భావోద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి. నారాయణ కుటుంబ సభ్యులు.. బంధుమిత్ర వర్గాల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం భారీగా పూలతో అలంకరించిన వాహనం మీద అంతిమయాత్రను ప్రారంభించారు.
ఆ వాహనంలో మంత్రి నారాయణ.. ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు.. మంత్రి నారా లోకేశ్ అదే వాహనంలో అంత్యక్రియలు నిర్వహించిన పెన్నా తీరం వరకూ వెళ్లారు. ఈ ప్రాంతంలో గతంలో ప్రముఖులకు అంత్యక్రియలు నిర్వహించారు. తాజాగా.. నిషిత్ కు అంత్యక్రియలు నిర్వహించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/