థ్రిల్లర్ మూవీకి ఏ మాత్రం తీసిపోని రీతిలో సాగుతోంది బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వ్యవహారం. ఇప్పటికే పలు మలుపులు తిరిగిన ఈ ఉదంతానికి సంబంధించి తాజాగా మహారాష్ట్ర మంత్రి.. ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ మరోసారి నోరు విప్పారు. షారుక్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు మద్దతుగా మాట్లాడిన ఆయన.. ఇప్పుడు మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ అరెస్టు వెనుక సూత్రధారి బీజేపీ నేత మోహిత్ కాంబోజ్ అని ఆయన పేర్కొన్నారు. మంత్రి నవాబ్ మాలిక్ మాటల్ని చూస్తే.. ఆర్యన్ ను డ్రగ్స్ కేసులో అనవసరంగా బుక్ చేశారని.. వాస్తవానికి ఆయన క్రూజ్ పార్టీకి టికెట్లు కొనుగోలు చేయలేదని.. ఆర్యన్ ను ప్రతీక్ గాబా.. అమీర్ ఫర్నీచర్ వాలా అనే ఇద్దరు వ్యక్తులే అక్కడకు తీసుకెళ్లారన్నారు.
ఈ కేసు పూర్తిగా కిడ్నాప్.. డబ్బు వసూలుకు సంబంధించిన కేసుగా చూడాలంటున్నారు. ఆర్యన్ ను అదుపులోకి తీసుకున్న వెంటనే.. షారుక్ కు బెదిరింపులు మొదలయ్యాయని.. ఎన్ సీబీ అధికారి డబ్బు డిమాండ్ చేశారన్నారు. సమీర్ వాంఖడే.. మోహిత్ కాంబోజ్ లు ఇద్దరు డబ్బుల్ని డిమాండ్ చేశారని.. ఆర్యన్ అరెస్టు అయిన రోజు నుంచి షారుక్ కు బెదిరింపులు వస్తున్నాయన్నారు.
ఇప్పటికి ఈ ఉదంతం గురించి షారుక్ బయటకు మాట్లాడొద్దని ఆదేశాలు ఇస్తున్నారని.. ఈ కారణంతోనే ఆయన ఇప్పటివరకు ఈ కేసు గురించి మాట్లాడలేదని చెబుతన్నారు. ఇప్పటికైనా షారుక్ నోరు విప్పాలని.. కొడుకును కిడ్నాప్ చేస్తే.. డబ్బు ఇవ్వటంలో తప్పు లేదంటున్నారు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ ఉదంతం మొత్తం ఒక కుట్రలో భాగంగా జరిగిందన్న ఆయన.. మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బ తీయాలని ప్లాన్ చేశారంటున్నారు.
క్రూజ్ షిప్ లో ఫ్యాషన్ టీవీ ఎండీ కషిఫ్ ఖాన్ కు చెందిన స్మోకింగ్ రోల్స్ కూడా దొరికాయని.. మరి ఆయన్ను ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ప్రశ్నించారు. క్రూయిజ్ లో మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారని.. ఆ తర్వాత వారిని వదిలేశారని.. ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే వారు మోహిత్ కాంబోజ్ కు.. రిషబ్ సచ్ దేవ్ దగ్గర బంధువుగా చెబుతున్నారు. ఇక.. మోహిత్ కాంబోజ్ విషయానికి వస్తే.. ఎన్ సీబీ అధికారి సమీర్ వాంఖడేకు సన్నిహితుడన్న సంగతి తెలిసిందే. మంత్రి నవాబ్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.