కోరిక తీరిస్తేనే పనిచేస్తానంటున్న మంత్రి పీఏ

Update: 2018-06-07 06:20 GMT
అనంతపురం జిల్లాలో మంత్రి పీఏ కామపైశాచికత్వం బయటపడింది.  సాయం కోసం వచ్చే అసహాయ మహిళలకు తన కోరికలు తీరిస్తేనే పనిచేసిపెడతానని బెదిరిస్తున్న తీరు వెలుగులోకి వచ్చింది. మంత్రి ఏరికోరి నియమించుకున్న ఈ అర్హతలు లేని పీఏ ఆగడాలు  విశృంఖలంగా సాగుతున్నా ఎవ్వరూ పట్టించుకోకపోవడం అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మంత్రి అండదండలతోనే అతడి ఆగడాలు  సాగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగి శాఖపరమైన సమస్యతో మంత్రిని, కీలకంగా ఉన్న మంత్రి కొడుకును కలుద్దామని వచ్చింది. వారు అందుబాటులో లేకపోవడంతో ఓ మధ్యవర్తి ద్వారా మంత్రి పీఏను కలిసింది.  పనిచేసి పెట్టేందుకు ఓ లక్ష రూపాయలు కూడా ఇస్తానంది. కానీ మంత్రి పీఏ అంతకుమించి ఆశించాడు. తోటి ఉద్యోగికి అదే విషయాన్ని ఫోన్లో వివరించాడు. ఆ కోరిక తీరిస్తేనే ఆమె పని అవుద్ది అని స్పష్టం చేశాడు. ఇప్పుడా ఆడియో టేపు బయటకు వచ్చింది.

పనికోసం వచ్చే మహిళలను తన కోరిక తీర్చాలని మంత్రి పీఏ వేధింపులకు గురిచేస్తాడనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. పురుషుల వద్ద నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేసే పీఏ మహిళలు కనపడితే మాత్రం డబ్బులు తీసుకోడు. ప్రతిగా తన కామవాంఛ తీర్చమంటాడు. మంత్రిని కలిసినా ఆ పని చేయాల్సింది తామే కాబట్టి.. తాము చెప్పినట్టు వింటే అన్నీ సాఫీగా జరిగిపోతాయంటూ నమ్మబలికి లోబరుకుంటున్నాడు. ఇందుకోసం తోటి ఉద్యోగులను పావులుగా వాడుకుంటున్నాడు. అయితే ఈ విషయం మంత్రి దృష్టికి వెళ్లినప్పటికీ తన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అని ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్టు తెలిసింది.

తాజాగా ఇటీవల ఓ మహిళా ఉద్యోగి మధ్యవర్తి ద్వారా మంత్రి పీఏను ఆశ్రయించింది. ఈ సందర్భంగా తన సహ ఉద్యోగితో ఆ మహిళ గురించి సాగించిన ‘లైంగిక కోర్కెల’ సంభాషణ టేపు బయటకు వచ్చింది. ప్రస్తుతం అనంతపురం లో చర్చనీయాంశంగా మారిన ఆ టేపుతో మంత్రి పరువు గంగలో కలిసిపోతోంది.

పీఏ: మహిళ ఉద్యోగి క్యారెక్టర్ ఏంటి.?
సన్నిహితుడు:  మంచిదే.. పాపం ఎవరూ ‘తోడు లేరు’.

పీఏ: అదికాదయ్యా.. నేనడిగేది.. ‘ఏంటి ఆ..మె పరిస్థితి.?’ అని
సన్నిహితుడు: భర్తతో విభేదాలొచ్చి దూరంగా ఉంటోంది.

పీఏ : అఅ.. ఫర్వాలేదా.?
సన్నిహితుడు : ఊ పర్లేదు సార్..?

పీఏ: అంటే ఎలాంటిది అని అడుగుతున్నా..
సన్నిహితుడు: అంటే క్యారెక్టర్ గురించి అడుగుతున్నారా.?

పీఏ : అవును.. డీబ్యాచ్ లరా.?
సన్నిహితుడు : క్యారెక్టర్ మరీ అంత బ్యాడ్ కాదు సార్.. భర్తకు దూరంగా ఉంటోందట సార్..

పీఏ: మంత్రిని కలిసినా తమకే పని అప్పజెప్పుతారు.. ఖర్చులంటాయి.. పనిచేయాల్సింది నేనే
సన్నిహితుడు: మంత్రి ఇంటివద్దకు ఆమెను పంపుదామనుకున్నా.. మీరు మధ్యలోనే కలిసి ఫోన్ లోనే ఆ ‘పని’ చేసి పెట్టారని చెప్పింది.

పీఏ: మరి ఇప్పుడేమంటోంది.. హ్యాపీనా ఆమె..
సన్నిహితుడు : ఆ హ్యాపీనే సార్..

పీఏ: కాకపోతే ఆమె లక్ష ఇస్తానంటోంది కదా.. డబ్బు రూపంగా కాకుండా ‘మరోలా సహకరించమని’ చెప్పు..
సన్నిహితుడు : ఓకే సార్..
Tags:    

Similar News