ఏపీ రాజధాని అమరావతిలో మంత్రులు నివాసాలు ఏర్పాటు చేసుకునే ప్రక్రియ జోరందుకున్నట్లే. జూన్ 1 నాటికి ఎట్టి పరిస్థితుల్లో ఏపీ సచివాలయ ఉద్యోగులు విజయవాడకు వచ్చేయాలంటూ ఏపీ సర్కారు విస్పష్ట ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందే.. ఏపీ మంత్రులు ఒక్కొక్కరుగా విజయవాడకు సమీపంలోని రెయిన్ ట్రీ పార్క్ లోకి తమ నివాసాల్ని ఏర్పర్చుకునే విషయంలో ముందుకెళుతున్నారు.
తాజాగా ఏపీ పౌరసరఫరాల శాఖామంత్రి పరిటాల సునీత.. రెయిన్ ట్రీ పార్క్ లోని నివాస గృహాంలోకి సోమవారం అడుగు పెట్టారు. ఏపీ మంత్రులు.. ముఖ్య అధికారులంతా విజయవాడకు సమీపంలోని నాగార్జున యూనివర్సిటీకి సమీపంలో ఉండే రెయిన్ ట్రీ పార్కులో గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా పరిటాల సునీతతో పాటు ఆమె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
రెయిన్ ట్రీ పార్క్ లో నివాసం ఏర్పర్చుకున్న మంత్రుల్లో మంత్రి రావెల కిషోర్ బాబు మొదటి వ్యక్తిగా.. ఇతర జిల్లాలకు చెందిన మంత్రుల్లో పరిటాల సునీత మొదటి వ్యక్తి కావటం గమనార్హం. తాజా పరిణామాలతో మిగిలిన మంత్రులు సైతం రెయిన్ ట్రీ పార్కులో నివాసాలు ఏర్పర్చుకోవటం త్వరలోనే జరిగిపోతుందంటున్నారు. గృహప్రవేశం సందర్భంగా బిజీగా ఉన్న పరిటాల సునీత.. తాను ఇన్ ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్న శ్రీకాకుళం జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబువెళ్లినా.. ఆమె మాత్రం వెళ్లలేదు. ఇంట్లో శుభకార్యంతో బిజీగా ఉంటే.. అధికారిక విధులు సాధ్యం కాదు కదా.