చంద్రబాబు, పెద్దిరెడ్డి: ఎస్వీ యూనివర్సిటీ నుంచి కుప్పం వరకు 50 ఏళ్ల యుద్ధం
కుప్పంలో చంద్రబాబునాయుడు పర్యటన ఆంక్షల నడుమ రెండో రోజున కొనసాగుతోంది. చంద్రబాబును ఆంక్షల చట్రంలో ఇరికించడం వెనుక ప్రధాన వ్యక్తి జగనే అని చాలామంది అనుకుంటుంటారు. కానీ, జగన్‌తో సమానంగా చంద్రబాబు విషయంలో వైరం సాగించే వ్యక్తి ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కుప్పం కేంద్రంగా సాగుతున్న వీరిద్దరి వైరం ఇప్పటిది కాదు.. దాదాపు 50 ఏళ్ల చరిత్ర ఉంది వీరి వైరానికి.
శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ(ఎస్వీయూ)లో చదువుకునే రోజుల నుంచి చంద్రబాబు, పెద్దిరెడ్డిల మధ్య వైరం కొనసాగుతోంది. వీరిద్దరూ యూనివర్సిటీలో చదువుకున్న రోజులలో వీరితో పాటు చదువుకున్నవారిలో ఐఏఎస్‌లు అయినవారు, రాజకీయాల్లో ఉన్నవారు, ప్రొఫెసర్లు, సాహితీరంగంలో ఉన్నవారు ఉన్నారు. పెద్దిరెడ్డి, చంద్రబాబులిద్దరూ రాజకీయంగా యాక్టివ్‌గా ఉండేవారని అప్పటివారు చెప్తుంటారు.
1975 ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోషియాలజీలో ఎంఏ చదివేవారు. చంద్రబాబు ఎకనమిక్స్ చదివేవారు. అక్కడికి ఏడాది తరువాత యూనివర్సిటీలో ఎన్నికలు జరిగాయి. పెద్దిరెడ్డి చైర్మన్‌గా పోటీ చేశారు. చంద్రబాబు పోటీ చేయనప్పటికీ పెద్దిరెడ్డి ఓటమి కోసం పనిచేశారు. రెడ్డి వ్యతిరేక కులాలన్నీ చంద్రబాబుతో కలిసి పనిచేశాయి. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో పెద్దిరెడ్డే గెలిచారు.
అప్పట్లో యూనివర్సిటీలు తక్కువగా ఉండేవి. దీంతో నాయకులు కూడా యూనివర్సిటీలలో తమ పట్టు పెంచుకునే ప్రయత్నం చేసేవారు. ఆ క్రమంలోనే నీలం సంజీవరెడ్డి ఎస్వీయూనివర్సిటీలో తన వర్గంగా మలచేందుకు పెద్దిరెడ్డిని వాడుకున్నారు. ఆయనకు అండదండలు అందించారు. చంద్రబాబుకు అప్పటికి ఎమ్మెల్సీగా ఉన్న గల్లా రాజగోపాల్ నాయుడు మద్దతిచ్చారు. అంతేకాదు.. రాజగోపాల్ నాయుడు ద్వారా చంద్రబాబు ఎన్జీరంగాను కలిశారు. చంద్రబాబుకు ఎన్జీరంగా అండదండలు దొరికాయి.
ఆ తరువాత రాజకీయంగా వారు సొంతంగా అభిప్రాయాలు ఏర్పరుచుకుంటూ ఎదిగారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలోకి రాగా పెద్దిరెడ్డి జనతాపార్టీలో చేరారు. ఎమర్జెన్సీ తరువాత జరిగిన 1978 ఎన్నికలలో పెద్దిరెడ్డి పీలేరు నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి పీలేరు నుంచే పోటీ చేశారు. కానీ, ఈసారి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత పెద్దిరెడ్డి 1989లో పోటీ చేసి అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టారు.
మరోవైపు చంద్రబాబు కూడా తొలిసారి 1978లో పోటీ చేసి అదే ఎన్నికల్లో విజయం సాధించగలిగారు. ఆయన ఇందిరా కాంగ్రెస్ నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ఆ తరువాత 1983 ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. టీడీపీ నుంచి పోటీ చేసిన మేడసాని రామానాయుడు ఆయనపై గెలిచారు. అనంతరం చంద్రబాబు టీడీపీలో చేరి 1989 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం వీడి కుప్పం నుంచి పోటీ చేశారు. అప్పటి నుంచి ఆయన విజయాలు సాధిస్తూనే ఉన్నారు.
అప్పట్లో చంద్రబాబు, పెద్దిరెడ్డి వర్గాల మధ్య తీవ్ర కొట్లాటలు జరిగేవనని చెప్తారు. అలా అప్పటి నుంచి ముదురుతూ వచ్చిన వివాదం ఇప్పటికీ కొనసాగుతోందని.. చంద్రబాబు సీఎం స్థాయికి ఎదగ్గా.. రామచంద్రారెడ్డి ఏ ప్రభుత్వంలో ఉన్నా కింగ్ మేకర్‌గా ఉంటూ కీలకంగా ఉంటున్నారు. కానీ, ఇద్దరి మధ్య వైరం మాత్రం ఇప్పటికీ చల్లారలేదంటారు రాజకీయ విశ్లేషకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.