నేటి రాజకీయాల్లో నేతలు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే వారు ఏం చెప్పినా వెంటనే రియాక్ట్ అయ్యేం దుకు ప్రజలకు కుదరకపోవచ్చు.. వారికి ఎన్నికలు వచ్చే వరకు సమయం పట్టొచ్చు.
ఇక, ప్రతిపక్షాలు మాట్లాడినా దానికి రాజకీయ రంగు పులిమేసి తప్పించుకోవచ్చు. కానీ, సోషల్ మీడియా అనేది ఒకటుంది. దాని నుంచి తప్పించుకోవడం అంత ఈజీ అయితే కాదు. ఇప్పుడు సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలోనూ సోషల్ మీడియా ఇలానే రియాక్ట్ అవుతోంది.
తాజాగా ఆయన సీమ ప్రజలు పాలనా రాజధానిని కోరుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఇది చిన్నవిషయమని అనుకున్నారో.. లేక ప్రభుత్వం తరఫున గట్టి వాయిస్ వినిపిస్తున్నానని భావించారో తెలియదు కానీ.. పెద్దిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్య ఇప్పుడు సీమ రాజకీయ కలకలానికి దారితీసింది. ''మీరిస్తానం టే మేం వద్దంటామా?'' అంటూ ఇక్కడి యువత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అసలు వెనుక బడిన జిల్లాలు ఉన్నది, వలస ప్రాంతంగా ఉన్నది సీమేనని వారు చెబుతున్నారు. అంతేకాదు హైకోర్టు ఇచ్చి తమకు చేసే 'న్యాయం' ఏంటని కూడా వారు ప్రశ్నిస్తున్నారు.
రాజకీయ వ్యూహాలతో ఇప్పటికే సీమ ప్రాంతానికి అన్ని ప్రభుత్వాలు అన్యాయం చేశాయని, ఇప్పుడు పాలన రాజధాని ఇస్తే తప్పులేదని అసలు ఈ విషయం దిశగా ఎందుకు ప్రయత్నం చేయకూడదని కొందరు మేధావులు కూడా ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి నిన్న మొన్నటి వరకు ఇక్కడి ప్రజలకు ఈ ఆలోచనేలేదు.
కానీ, పెద్దిరెడ్డి రేపిన ప్రశ్న ఇక్కడ వారిని ఆలోచింపజేస్తోంది. మాకు కూడా పాలనా రాజధాని కావాలని లేకపోతే అమరావతనే కొనసాగించాలని ఇప్పుడు ఇక్కడివారు కోరుతున్నారు.
అధిష్టానం సీరియస్?పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్టు తాడేపల్లి వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇప్పటికే ఉన్న తలనొప్పులను తగ్గించుకు నేందుకు ప్రయత్నిస్తుంటే, కొత్తగా ఈ తలనొప్పులు ఎందుకు? అని సీరియస్ అయినట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.