ఇప్పుడు అందరి దృష్టి జీఎస్టీ మీదనే. అర్థం అయినట్లే అనిపిస్తూ.. అర్థంకానట్లుగా తెగ కన్ఫ్యూజ్ చేస్తున్న ఈ సరికొత్త పన్నుల విధానంపై వస్తున్న వార్తలు భారీగా వస్తున్నాయి. ఈ వార్తలతో వస్తున్న ఇబ్బంది ఏమిటంటే.. ఒకసారి బాగా అర్థమైనట్లుగా అనిపిస్తూనే.. మరోసారి చాలా సందేహాల్ని కలిగేలా చేస్తున్నాయి. మొత్తంగా జీఎస్టీ కారణంగా కలిగే ప్రయోజనం ఏంటి బాస్ అని అడిగితే.. సూటిగా సమాధానం చెప్పే వారి సంఖ్య చాలా తక్కువే.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జీఎస్టీ మీద పని మొదలు పెట్టింది కాంగ్రెస్ అయితే.. దాన్ని అమల్లోకి తెచ్చే అదృష్టం బీజేపీకి తగ్గింది. అయితే.. తాము స్టార్ట్ చేసిన జీఎస్టీని ఇప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. ఇదంతా రాజకీయంలో భాగమన్నది వదిలేస్తే.. జీఎస్టీ మీద ప్రజల్లో ఉన్న సందేహాల్ని తీర్చేలా ప్రిపేర్ కావాలని తన మంత్రులకు సూచించారు యూపీ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్.
యోగి మాటల్ని ఆయన మంత్రులు ఎంత సీరియస్ గా తీసుకున్నారన్న విషయం తాజాగా చోటు చేసుకున్న ఒక ఉదంతంలో అందరికి అర్థమయ్యేలా చేసింది. జీఎస్టీ మీద యోగీ మంత్రివర్గంలో సంక్షేమ.. ఎస్సీ..ఎస్టీ వ్యవహారాల్ని చూసే మంత్రి రామాపతి శాస్త్రిని మీడియా ప్రతినిధులు కొన్ని ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా ఆయన సమాధానం చెప్పిన అంశాలతో కూడిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఇందులో.. మంత్రిగారికి జీఎస్టీ ఎంత షాకిస్తుందో స్పష్టంగా కనిపిస్తుంది.
అసలు జీఎస్టీ అంటే ఏమిటంటూ ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు మంత్రిగారు తెల్లముఖం వేశారు. పెద్దాయన పరిస్థితిని అర్థం చేసుకున్న వారు జీఎస్టీ అంటే ఏమిటో చెప్పేందుకు ప్రయత్నించినా.. మంత్రిగారు మాత్రం ఫాలో కాలేకపోయారు. తనకు జీఎస్టీ అర్థం తెలుసని.. కానీ ఇప్పుడు గుర్తుకు రావటం లేదని కవర్ చేసే ప్రయత్నం చేశారు. జీఎస్టీ గురించి తనకు అవగాహన ఉందని.. దాని గురించి మరింత తెలుసుకునేందుకు తాను మరింత స్టడీ చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకున్నారు. కొసమెరుపు ఏమిటంటే.. జీఎస్టీ గురించి ప్రజలు గందరగోళ పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం యోగి మీటింగ్ పెట్టి మరీ మంత్రులకు చెబితే.. ఇప్పుడిలా అడ్డంగా బుక్ కావటం విశేషం.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/