ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబుకు బ్యాడ్ టైం నడుస్తోంది. అమరావతి భూ దందా పేరుతో వైఎస్ జగన్ పత్రికలో వస్తున్న కథనాల్లో రావెల దళిత మంత్రిగా ఉండి కూడా అసైన్డ్ స్థలాలు కొన్నారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కుమారుడు సుశీల్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. బంజారాహిల్స్ లో నడుచుకుంటూ వెళ్తున్న ఓ ముస్లిం యువతి పట్ల సుశీల్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన స్థానికులు స్పందించి మద్యం మత్తులో ఉన్న రావెల సుశీల్ - కారు డ్రైవర్ ను చితకబాదారు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రాజధాని భూముల వివాదం దుమారంపై ఈ నేపథ్యంలో రావెల వివరణ ఇస్తూ ఆ కొనుగోలును అంగీకరించారు. దళితులకు అండగా ఉండాల్సిన మంత్రే వాటిని చెరబట్టారనే రచ్చ సాగుతోంది. ఈ సమయంలో రావెల కుమారుడు వివాదంలో పడటం ఆయనకే కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వానికి తలనొప్పిగా మారనుందని భావిస్తున్నారు.