ఎవరు స్క్రిప్టు ఎవరు చదువుతున్నారు అని ప్రశ్నిస్తోంది విపక్ష పార్టీలకు చెందిన నాయక శ్రేణి. చంద్రబాబు స్క్రిప్ట్ ను పవన్ చదువుతున్నాడు అని అంటున్నారు మంత్రి రోజా.. దీనిపైనే పొలిటికల్ సర్కిల్స్ లో వాడీవేడీ చర్చ జరుగుతోంది.
అంటే జగనన్న రాసిచ్చిన స్క్రిప్ట్ ను రోజా చదువుతున్నారా అన్న కౌంటర్లు కూడా వినిపిస్తున్నాయి..సోషల్ మీడియాలో..! ఏదేమయినప్పటికీ పదవి రాగానే రోజా తన వాగ్దాటి తగ్గించారని చాలా మంది అనుకున్నప్పటికీ చాలా రోజుల తరువాత రోజా తన నోటికి పని చెప్పి వైసీపీ అధినాయకత్వం దగ్గర మార్కులు కొట్టేశారు.
ఇక మిగిలిన నాయకులు కూడా ఏ స్థాయిలో బూతులు మాట్లాడుతూ తిడతారో మరి! ఎందుకంటే జగన్ ను ఏమన్నా వారు ఓర్వలేరు సరికదా ! పవన్ లాంటి నాయకులు నాలుగు మాటలు విమర్శనాత్మక ధోరణిలో అంటే అస్సలు ఓర్వలేరు. ఇప్పటికే చాలామంది నాయకులు టీడీపీ వాళ్లకు అంతు చూస్తాం అని అంటున్నారు. రాయలేని భాషలో తిడుతున్నారు. కారణాలు ఏవయినా సరే ! అవి తప్పు అని చెప్పేవారే లేరు వైసీపీకి!
ఆ సంగతి మరిచిపోయారా ! : జనసేన వాదన ఇది
వాస్తవానికి పర్యాటక శాఖ ను అప్పగించిన వెంటనే రోజా తన ఆనందాన్ని చిరుతో పంచుకున్నారు. ఆ ఇంట ఆతిథ్యం అందుకున్నారు. మెగా స్టార్ -తో సన్మానం చేయించుకున్నారు.
వీడియోలు, ఫొటోలు తీయించుకుని తన కుటుంబంతో సహా ఆ రోజు అక్కడే ఉండి వచ్చారు. ఇంతలోనే అవన్నీ మరిచిపోయి రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ పవన్ అభిమానులు మండిపడుతున్నారు.
అంటే వాస్తవాలు మాట్లాడేందుకు చంద్రబాబే స్క్రిప్టు రాయాలా? ఆ పాటి నిజాలు ఆ పాటి క్షేత్ర స్థాయి వాస్తవాలు తమ అధినేత పవన్ కల్యాణ్-కు తెలియదనుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్నారు. అంటే కోనసీమలో ఏం జరిగినా వాటిపై తాము మాట్లాడాలంటే తెలుగుదేశం పార్టీ చెబితేనే మాట్లాడాలా ? మరి ! మీరు కూడా ఎవరు రాసిచ్చిన స్క్రిప్ట్ ను అదే విధంగా అద్దె డైలాగులను వల్లిస్తున్నారో చెప్పగలరా ? అంటూ పవన్ శ్రేణులు మండిపడుతున్నాయి.