దేశంలోనే ప్రథమ పౌరురాలు.. రాష్ట్రపతి వస్తుందంటే ఆ రాష్ట్రం తరుఫున ప్రొటోకాల్ ప్రకారం ఎవరైనా ఒకరు రిసీవ్ చేసుకుంటారు. తెలంగాణలో మంత్రి సత్యవతి రాథోడ్ ఈ పనిచేయగా.. ఏపీలో మాత్రం ఆ బాధ్యత మంత్రి రోజాకు ఈసారి ఇచ్చారు. ఏపీలోని శ్రీశైలంకు వచ్చిన రాష్ట్రపతి దాదాపు నాలుగైదు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఏపీ ప్రభుత్వం తరుఫున మంత్రి రోజానే రాష్ట్రపతితో ఉండి ప్రొటోకాల్ ప్రకారం పాల్గొనేలా ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ప్రతీచోటా రోజాను పాల్గొనేలా చూడాలి.
రాష్ట్రపతితోపాటు కేంద్రప్రభుత్వం తరుఫున కిషన్ రెడ్డి వచ్చారు. రాష్ట్రప్రభుత్వం తరుఫున రోజా వచ్చారు. ఆమె పేరును రాష్ట్రపతి సెక్యూరిటీ ఇచ్చే సైన్యానికి పెట్టాలి. కానీ అధికారుల నిర్లక్ష్యమో.. మరేదో తెలియదు కానీ.. రోజాను ఘోరంగా అవమానించారు. తీసిపారేసిన పరిస్థితి నెలకొంది.
రాష్ట్రపతి ప్రోగ్రాంల వద్దకు మంత్రి రోజా వస్తుంటే ఆమె పేరు లేదని కేంద్ర సెక్యూరిటీ ఆపేసిన పరిస్థితి నెలకొంది. రోజా పేరు లేదని.. మేం అనుమతించమని ఒక రాష్ట్రమంత్రిని రాష్ట్రపతితో కలవనీయలేకపోవడం దుమారం రేపింది. అలాగా రెండు చోట్ల ఆపారు.
చివరకు రోజా పరిస్థితి చూసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రమంత్రిని ఆపడం ఏంటని కేంద్ర పోలీసులపై మండిపడ్డారు. రోజాను వెనక్కి తీసుకొచ్చి మరీ ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేశారు. కిషన్ రెడ్డి ఆదేశాలతో కేంద్ర పోలీసులు రోజాను రప్పించి ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేశారు.
అయితే రోజా మాత్రం ఘోరంగా అవమానానికి గురైంది. మనస్తాపంతో తిరిగి వెళ్లడానికి రెడీ కాగా కిషన్ రెడ్డి చొరవతో పాల్గొంది. మరి ప్రొటోకాల్ లోపమా? అధికారులు రోజా పేరు ఇవ్వకుండా చేశారా? రాష్ట్రపతి కార్యాలయంలో రోజా పేరు మిస్ అయ్యిందా? అన్నది తేలాల్సి ఉంది.
కానీ స్వరాష్ట్రంలో స్వమంత్రి అయిన రోజాకు అవమానం జరగడాన్ని ఎవరూ జీర్ణించుకోవడం లేదు. ఆమె కూడా ముభావంగా కనిపించారు. మంత్రి రోజాకు రాష్ట్రపతి సాక్షిగా అవమానం జరిపించుకున్న ఘనత మన అధికారులకే చెందింది. ఇలాంటి విషయాల్లో కాస్తైన జాగ్రత్తలు పాటించకుంటే మరింత అవమానం కలగడం ఖాయంగా చెప్పొచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.