మర్యాదస్తులతో వచ్చే ఇబ్బంది ఒకటి ఉంటుంది. ఇష్టారాజ్యంగా మాట్లాడే వారిని కూడా మర్యాదస్తులుగా వ్యవహరించే వారు తమ పద్దతిని మార్చుకోరు. వారి పాపానికి వారిని వదిలేస్తుంటారు. నిజానికి మర్యాదస్తుల మీద విరుచుకుపడే వారి కారణంగా గౌరవంగా ఉండే వారి స్థాయి మరింత పెరుగుతుంది. అంత పెద్ద మనిషి గౌరవాన్ని నమ్ముకోవటం వల్ల ఎనెన్ని మాటలు పడ్డారో అన్న ఫీలింగ్ సామాన్యులకు కలుగుతుంది. నోరు ఏసుకొని బతికేటోళ్లు చాలామంది ఎదుటివారి మంచితనాన్ని అసరాగా చేసుకుంటారు. రాజకీయ రంగంలో ఇలాంటివి మరింత ఎక్కువ. ఈ కారణంతోనే సున్నిత మనస్కులు.. గౌరవ మర్యాదలతో ఉండేవారికి రోత రాజకీయాలు అవసరమా? అన్న మాట తరచూ తెర మీదకు వస్తూ ఉంటుంది.
తెలుగు రాజకీయాల్ని చూస్తే.. పాత రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టి.. కొత్త తరహా రాజకీయాల్ని ఉమ్మడి రాష్ట్రానికి పరిచయం చేసిన అధినేతగా చంద్రబాబును చెప్పొచ్చు. ఆ మాటకు వస్తే.. ఆయన్ను.. ఆయన విధానాల్ని చాలామంది తప్పు పడుతుంటారు. కానీ.. మారే కాలానికి తగ్గట్లు..కొన్ని పరిస్థితులకు అనుగుణంగా ఆయన వ్యవహరించిన తీరుకు గడిచిన కొద్దికాలంగా ఆయన మాటల రూపంలోఅనుభవిస్తున్నారు. మాకిక్కడ చంద్రబాబు చుట్టం కాదు. జగన్ విరోధి కాదు. పవన్ కల్యాణ్ రక్త సంబంధీకుడు కాదు. ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పటమే మా ఉద్దేశం.
ఈ కారణంతోనే చంద్రబాబు రాజకీయాల్ని పూర్తిగా మద్దతు ఇవ్వలేం. అలా అని పూర్తిగా వ్యతిరేకించలేం. కొన్నిసార్లు ఆయన కొన్ని తప్పులు చేశారు. అయితే వాటిని అప్పటి పరిస్థితులకు అనుగుణంగా చూడాల్సి ఉంటుంది. రాజకీయ వైరాన్ని వ్యక్తిగత స్థాయికి తీసుకెళ్లిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయితే.. తెలుగు రాజకీయాల్ని అధమ స్థాయికి తీసుకెళ్లిన ఘనత జగన్ కు దక్కుతుంది.
రాజకీయంగా సవాలచ్చ ఉండొచ్చు. కానీ.. కనీస గౌరవ మర్యాదల్ని పాటించే విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబును వంక పెట్టలేం. అదే సమయంలో పవన్ కల్యాణ్ విషయానికి వస్తే.. ఆయన తొలి స్టేట్ మెంటే మంట పుట్టించింది. పంచెలూడదీసి కొడతా అంటూ ఆయన అన్న మాట అప్పట్లో పెను సంచలనంగా మారింది. అన్నయ్య పార్టీలో తమ్ముడి పాత్రకు.. తానే స్వయంగా పెట్టిన పార్టీకి అధినేతగా వ్యవహరించే ఆయనలో చాలానే మార్పు వచ్చింది. 2019 ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత ఆయన మాటలోనూ.. చేతల్లోనూ మార్పులు వచ్చాయి. గతానికి మించిన జాగ్రత్త పెరిగింది. తొందరపాటుతో వ్యవహరించకుండా.. అతిగా ఆవేశపడకుండా.. జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
అదే పవన్ కు ఇప్పుడు శాపమైంది. రోజా..పేర్ని నాని.. లాంటి చాలామంది నేతలు అవసరం ఉన్నా లేకున్నా పవన్ మీద విరుచుకుపడుతుంటారు. బాబు.. పవన్ లాంటి మర్యాదస్తుల మీద విరుచుకుపడుతూ తమ ప్రతాపాన్ని ప్రదర్శిస్తుంటారు. మరి.. అలాంటి ఫైర్ బ్రాండ్ నేతలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గాల్లో తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఊరంతటికి నీతులు చెప్పే ఆర్కే రోజాకు.. తాను ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న నగరిలో సొంత పార్టీ నేతలకు సమాధానం చెప్పలేక బేలతనాన్ని ప్రదర్శిస్తున్నారు.
తాను ప్రాతినిధ్యం వహించే నగరి నియోజకవర్గంలో వర్గపోరుకు చెక్ పెట్టే చేతకాని రోజా.. అక్కడ విబేధాల్ని పెంచుకుంటూ పోవటమే కాదు.. తన తీరుతో చివరకు చేతులెత్తేసే వరకు విషయం వెళ్లింది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. తన వైరి వర్గానికి చెందిన సొంత పార్టీ నేతల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ''ఇలాంటి వారు పార్టీలో ఉంటే నేను రాజకీయాలు చేయటం కష్టం. నాకు నష్టం కలిగించేలా కార్యక్రమాలు చేయటంపై పార్టీ పెద్దలు ఆలోచించాలి.
ఇలాంటి వారు పార్టీలో ఉంటే నేను రాజకీయాలు చేయటం కష్టం. ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పని చేస్తుంటే ప్రతిరోజు మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. వారిని నాయకులు ప్రోత్సహించటం బాధేస్తోంది. వారిని ఎలా కొనసాగించాలో ఆలోచించాలి'' అని పేర్కొన్నారు. ఇదంతా చూసినప్పుడు మర్యాదస్తులు.. మాట అనేందుకు మొహమాటం పడే వారి విషయంలో విరుచుకుపడే రోజా.. తన మాదిరి వ్యవహరించే వారి విషయంలో ఏమీ చేయలేక బేలతనంతో చేతులు ఎత్తేసే తీరు చూస్తే.. అసలు విషయం ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు. ఇదంతా చూసినప్పుడు.. బాబు.. పవన్ లాంటి వారి మీద మాటలు అనేసి బతికేయటం మినహా ఆమె మరింకేమీ చేయలేదన్న మాట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.