భూమి కోసం ఏపీ మహిళా మంత్రి సంతకం ఫోర్జరీ..

Update: 2020-02-13 08:30 GMT
ఏపీ మంత్రి తానేటి వనిత సంతకాన్ని ఫోర్జరీ చేశాడో కేటుగాడు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించటంతో మోసానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. సంచలనంగా మారిన ఈ ఉదంతం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. కడపకు చెందిన రెడ్డప్ప అనే వ్యక్తి మంత్రి వనిత లెటర్ పాడ్ ను.. సంతకాన్ని ఫోర్జరీ చేశాడు.

అసైన్డ్ భూమిని కేటాయించాలన్న అభ్యర్థన కోసం ఈ పాడు పని చేశాడు. అయితే.. అతగాడు తయారు చేసిన లెటర్ పాడ్ లో మంత్రి సంతకం తేడాగా ఉండటంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. కలెక్టర్ వద్దకు విషయాన్ని తీసుకెళ్లారు. వెంటనే.. ఎదవ పని చేసిన నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తన సంతకాన్ని ఫోర్జరీ చేసిన వైనంపై మంత్రి వనిత సీరియస్ అయ్యారు. తప్పుడు పని మీద హోం మంత్రి సుచరితకు.. డీజీపీ గౌతం సవాంగ్ కు కంప్లైంట్ చేశారు. తన లెటర్ హెడ్.. సంతకాన్ని ఫోర్జరీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి లెటర్ ప్యాడ్.. సంతకాన్ని ఫోర్జరీ చేసిన వైనం కలకలం రేపుతోంది. ఈ ఎదవ పని చేసిన వ్యక్తి పూర్వాపరాలు సేకరించే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు.


Tags:    

Similar News