సహవాస దోషమో ఏమోకానీ.. ఆంధ్రప్రదేశ్ కు ఆనుకొని ఉన్న తమిళనాడు రాష్ట్రంలో కూడా ఇప్పుడు బహుళ రాజధానులు కావాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఏపీలో సీఎం జగన్ మూడు రాజధానులను చేసి ప్రాంతీయ అసమానతలను తొలగించేస్తున్నాడు.
ఈ క్రమంలోనే పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలోనూ తాజాగా అదే డిమాండ్ తెరపైకి వచ్చింది. తాజాగా తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీకి చెందిన మంత్రి ఉదయ్ కుమార్ ఈ కొత్త ప్రతిపాదనకు పురుడుపోశాడు.
మంత్రి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘చెన్నైలో నిత్యం వరదలు, వర్షాలు వస్తున్నాయి. ఎండాకాలంలో కరువు కాటకాలు తీవ్రమవుతున్నాయి. కాబట్టి తమిళనాడుకు వెంటనే మధురైని రెండో రాజధానిగా ప్రకటించారు. దీంతో ప్రజలకు ఇబ్బంది లేకుండా పాలన ఉంటుంది.’ అని ఆయన తీర్మాణం చేశారు. దీనికి పలువురు నేతలు కూడా మద్దతు తెలుపడం విశేషం.
దీంతో తమిళనాట ఇప్పుడు దక్షిణ తమిళనాడు ప్రాంత వాసులంతా ఉత్తరాన ఉన్నచెన్నైకి ప్రత్యామ్మాయంగా ముధరైని రెండో రాజధాని చేయాలని డిమాండ్ చేస్తున్నారు.