ప‌వ‌న్ పై రెచ్చిపోయిన మంత్రి..మ‌రో నాని వ‌చ్చాడయ్యా?

Update: 2022-04-24 04:30 GMT
సున్నా వ‌డ్డీ ప‌థ‌కానికి సంబంధించి నిధులు అందించేందుకు స‌ర్కారు ముందుకు రావ‌డం బాగుంది. అంటే డ్వాక్రా మ‌హిళ‌లు తీసుకున్న రుణాల‌కు వ‌డ్డీ మాఫీ చేయ‌డం బాగుంది. మ‌రి ! ఇదే సంద‌ర్భంలో  మంత్రులు ఎందుకు రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు తావిస్తున్నార‌ని ! ఓ అధికారిక కార్య‌క్ర‌మంలో ఏం మాట్లాడాలో ఏ విధంగా న‌డుచుకోవాలో కూడా వీళ్ల‌కు తెలియ‌డం లేదా అని
విప‌క్షాలు  మండిప‌డుతున్నాయి. వాస్త‌వానికి అధికారిక కార్య‌క్ర‌మం అంటే ఏంటి ఈ ప్ర‌భుత్వం ఏం చేసింది ఏం చేయాల‌నుకుంటుంది అన్న‌వి  క‌దా వివ‌రించాలి. అవి వ‌దిలేసి మిగిలిన విష‌యాల‌న్నీ మాట్లాడ‌తారేంటో ? క‌నీస అవగాహ‌న అన్న‌ది లేకుండానే వీళ్లంతా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారా? అని కూడా ప్ర‌శ్నిస్తోంది జ‌న‌సేన. ఇక వివాదం విష‌యానికే వ‌ద్దాం.

అప్ప‌ట్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ను టార్గెట్ చేస్తూ కొడాలి నాని కానీ పేర్ని నాని కానీ అనిల్ కానీ ఇంకా ఇత‌ర మంత్రులు కానీ భ‌లే మాట్లాడేవారు. అస‌లు ఆ మాట‌లు రాయ‌డం క‌న్నా రాయ‌కుండా ఉండ‌డ‌మే మేలు. ఎందుకంటే విమ‌ర్శ కూడా కాదు అంత‌కుమించి ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి కించ‌ప‌రిచి మాట్లాడి పాపం ఆ రోజు మాట్లాడిన బూతుల మంత్రులంతా ఇళ్ల‌కు ప‌రిమితం అయి ఉన్నారు. మంత్రి వ‌ర్గ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ‌లో వాళ్ల‌కు చోటే లేదు.

ఇదే ఒర‌వ‌డిలో వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ అనే దేవాదాయ ధ‌ర్మాదాయ శాఖ మంత్రి కూడా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల్లో ముందుండే వారు. ఆయ‌న్ను టార్గెట్ గా చేసుకుని ప‌వ‌న్ అభిమానులు కూడా సోష‌ల్ మీడియాలో వెర్బ‌ల్ ఎటాక్ బాగానే ఇచ్చేవారు. ఇప్పుడు ఆయ‌న స్థానంలో వ‌చ్చిన కొట్టు స‌త్య‌నారాయ‌ణ కూడా ఇదే ఒరవ‌డితో ముందుకు వెళ్తున్నారు.

రాష్ట్రంలో కాపు సామాజిక‌వ‌ర్గానికి జ‌న‌సేనాని తీవ్ర అన్యాయం చేస్తున్నాడ‌ని ఆరోపిస్తూ మ‌రికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. సినీన‌టుడిగా ఉన్న ప‌వ‌న్ కల్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీ లో కేవ‌లం సినిమా వ్యామోహంతో మాత్ర‌మే కొంత‌మంది  కాపు యువ‌త ఉన్నార‌ని విమ‌ర్శించారు.

ప‌వ‌న్ క‌ష్టాల‌లో ఉన్న ఏ ఒక్క‌రికీ స్వ‌యంగా సాయం చేయ‌లేద‌ని అన్నారు. చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లో ఆయ‌న ప‌నిచేస్తున్నార‌ని, ప‌వ‌న్ కు రాజ‌కీయ విలువలు ఏవీ లేవ‌ని బాప‌ట్ల జిల్లా కేంద్రంలో ఇక్క‌డి మాన‌వ వ‌న‌రుల కేంద్రంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్య‌క్ర‌మంలో వేదిక‌పై నుంచి రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేశారు. ఇవి విన్నాక జ‌న‌సేన వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి.

త‌మను అనేముందు ఒక్క‌సారి వైసీపీ నేత‌లు ఎవ‌రేంటో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంద‌ని హిత‌వు చెబుతున్నాయి. రాజ‌కీయ విలువలు ఎవ‌రికి ఉన్నాయో అన్న‌ది ప్రజ‌లే ముందున్న కాలంలో తేలుస్తార‌ని  అంటున్నాయి. అందాక తాము కూడా వేచి చూసే ధోర‌ణికే ప్రాధాన్యం ఇస్తామ‌ని,గ‌తంలో నోటికి హ‌ద్దు లేకుండా ఏది ప‌డితే అది మాట్లాడి, అధికారం ఉంద‌న్న ద‌ర్పంతోనో లేదా గ‌ర్వంతోనో రెచ్చిపోయిన మంత్రులు ఇవాళ ఎక్క‌డ ఉన్నారో అంద‌రికీ తెలుసునని వ్యాఖ్యానిస్తున్నాయి.
Tags:    

Similar News