తిరుగులేని ప్రజాభిమానం.. అంతకు మించి విషయాల మీద అవగాహన ఉన్న అధినేతకు ఎవరి మీదా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అందుకు భిన్నంగా విషయాల మీద పట్టు లేనప్పుడు.. సదరు విషయాల్ని అధికారులు వివరించే క్రమంలో.. వారు ఆడ్వాంటేజ్ తీసుకోవటం కనిపిస్తుంటుంది. అందుకు భిన్నంగా అన్ని విషయాల మీద అవగాహన ఉన్న వేళలో అలాంటి ముఖ్యమంత్రుల ముందు.. ఎంతటి సీనియర్ అధికారులైనా సరే తోక జాడించకుండా జాగ్రత్తగా ఉండటం కనిపిస్తుంటుంది. ఇదంతా ఎవరి గురించి అంటే.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
అధికారులకు మించిన వినయ విధేయతలను సీఎం జగన్ ముందు ప్రదర్శిస్తుంటారు మంత్రులు.. ఎమ్మెల్యేలు. ఇలాంటి వారి విషయంలో కత్తితో కోసిన చందంగా ముఖాననే చెప్పేస్తుంటారని చెబుతారు. అనవసరమైన పొగడ్తలకు పెద్దగా చాన్సు ఇవ్వని తీరు జగన్ లో ఎక్కువగా ఉంటుందని చెబుతారు. అదే సమయంలో.. పని చేయకుండా నాటకాలు ఆడే వారిని సైతం జగన్ వదిలిపెట్టరని చెబుతారు.
తాజాగా ఇష్యూఏమంటే.. ఏపీ విపక్షంపై బలమైన ఆరోపణలు.. విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేయాల్సింది పోయి.. చాలామంది తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్న వైనాన్ని గుర్తించిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. తాజాగా వారికి భారీ హెచ్చరికను జారీ చేసిన వైనం తెలిసిందే. ''ప్రతిపక్షం విమర్శలకు కౌంటర్లు ఇవ్వరా? ఇక మీరు దేనికి? అంటూ కేబినెట్‌లోనే సీఎం సీరియస్ హెచ్చరిక చేసిన 24 గంటల్లోనే మంత్రులు, మాజీ మంత్రులు వరుసబెట్టి ప్రెస్‌మీట్లు పెట్టారు. టీడీపీకి ఓ రేంజ్‌లో కౌంటర్లు ఇచ్చారు.
లోకేష్ చేసిన ట్వీట్‌పై వార్నింగ్‌లే ఇచ్చారు. విపక్ష నేతలు విసిరే సవాళ్లకు సూటిగా.. సుత్తి లేకుండా సీరియస్ రియాక్షన్లు చూపించాలని.. లేని పక్షంలో వారిని మార్చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని తేల్చేయటం తెలిసిందే.
దీంతో.. మాజీ మంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ ను విమర్శలతో రౌండప్ చేస్తున్నారు వైసీపీ నేతలు. ప్రస్తుత మంత్రులు.. తాజా మాజీ మంత్రులు ఇలా ఎవరికి వారు సీఎం జగన్ మీద విమర్శలు చేసిన లోకేశ్ మీద ఘాటు విమర్శలు చేస్తున్న పరిస్థితి. జగన్ వార్నింగ్ ఫలించి.. ఆయన నోటి నుంచి మాట వచ్చిన గంటల వ్యవధిలోనే భారీ ఎత్తున ప్రతిపక్షాలను టార్గెట్ చేసి తమ విధేయతను ప్రదర్శిస్తున్నారు.
లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై వరుస ప్రెస్ మీట్లు పెట్టేసి ఆయన్ను తిట్టి పోస్తున్నారు. ఇదంతా చూసినప్పుడు సీఎం జగన్ వార్నింగ్ బాగానే పని చేసిందని చెప్పక తప్పదు. తాజాగా వరుస ప్రెస్ మీట్లు పెట్టేసి ప్రధాన ప్రతిపక్షం మీద పెద్ద ఎత్తున తిట్టిపోసేస్తున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి.. బాగా తిట్టినోళ్లకు.. ఏమేరకు వర్కువుట్ అవుతుందో కాలమే సరైన బదులు ఇస్తారని చెప్పక తప్పదన్న మాట వినిపించటం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.