తల్లి ప్రియుడిని హత్య చేసిన మైనర్ బాలుడు

Update: 2021-05-23 14:30 GMT
కన్నతల్లిని హింసిస్తున్న ఆమె ప్రియుడిని 14 ఏళ్ల బాలుడు దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది.  తల్లి చేసిన నిర్వాకానికి చదువుకోవాల్సిన బాలుడు ఇప్పుడు హత్య చేసి జైలు పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అహ్మదాబాద్ కు చెందిన ఓ వివాహిత 10 ఏళ్ల క్రితం భర్తను విడిచిపెట్టి 4 ఏళ్ల కొడుకుతో కలిసి తన ప్రియుడితో పారిపోయింది. అప్పటి నుంచి వీరు ముగ్గురూ జీవిస్తున్నారు. కొన్నాళ్లకు ప్రియుడి నిజస్వరూపం తెలిసింది. ఆ మహిళను కొట్టడం ప్రారంభించాడు. చిన్నారి మనసులో ఈ పెంపుడు తండ్రిపై పగ పెరిగింది. తల్లిని ఎందుకు కొడుతున్నావని ప్రశ్నిస్తే ఆ బాలుడిని కూడా కొట్టడం ప్రారంభించాడు.

10ఏళ్లుగా తండ్రి నరకాన్ని అనుభవిస్తున్న బాలుడికి 14 ఏళ్లు వచ్చాయి. బాలుడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ తల్లి  ప్రియుడిని అడ్డు తొలగించుకోవాలనే అభిప్రాయం బలపడింది.

ఈ క్రమంలోనే బాలుడు ఈనెల 17న తండ్రిని బైక్ పై ఎక్కించుకొని అహ్మదాబాద్ లోని బెహ్రాంపూర్ ప్రాంతంలో ఉన్న కాలికో వస్త్రపరిశ్రమ కాంపౌండ్ వద్దకు తీసుకెళ్లాడు.  తనతో తెచ్చుకున్న కత్తితో అతడిని కసితీరా పొడిచి హత్య చేశాడు. చచ్చిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.మైనర్ బాలుడే హత్యకు పాల్పడినట్టు పోలీసులు తేల్చారు. తల్లిని చిత్రహింసలు పెడుతున్నందునే తండ్రిని చంపాడని విచారణలో బాలుడు ఒప్పుకున్నాడు.
Tags:    

Similar News