నవ్యాంధ్రప్రదేశ్‌లో సోమవారం మధ్యాహ్నం స్వల్ప భూకంపం సంభవించింది. ఏపీలోని గుంటూరు - ప్రకాశం జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. రెండు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలందరూ భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. వారందరూ రోడ్లపైనే భయంగా గడిపారు.
అయితే, ప్రకాశం జిల్లాలో సంతమాగులూరు మండలం ఏల్చూరులో భూమి రెండు సెకన్లపాటు కంపించింది. ఈ భూ కంపన తీవ్రతకు ఇళ్లు, కార్యాలయాల్లోని వస్తువులు కిందపడ్డాయి. దీంతో కంగారుపడ్డ గ్రామస్థులు వీధుల్లోకి పరుగులు తీశారు. మళ్లీ ఏ క్షణంలోనైనా భూ ప్రకంపనలు సంభవిస్తాయేమోనని భయపడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ భూ ప్రకంపనలపై ప్రభుత్వం, వాతావరణ శాఖ అధికారుల నుంచి ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/