హైదరాబాద్ లో మరో ఘూరోం ....మైనర్ బాలికపై 74 ఏళ్ల వృద్ధుడు అఘాయిత్యం !

Update: 2020-02-01 05:39 GMT
ఈ సమాజం లో ఆడపిల్ల రక్షణ రోజురోజుకి మరింతగా క్షిణిస్తుంది. ఆడపిల్ల పై అఘాయిత్యాలు జరగకుండా , ఆడపిల్ల రక్షణ కోసం ఎన్ని చట్టాలు, ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇంకా ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. కఠిన శిక్షలు అమలు చేస్తే ఆడపిల్ల పై అఘాయిత్యాలు చేసేవారు తగ్గిపోతారు అనుకుంటే ...ఇంకా రోజు రోజుకి పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదు. దీని తో ప్రతి అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఇంటి నుండి కాలు బయట పెట్టిన అమ్మాయి ..మళ్లీ ఇంట్లోకి అడుగు పెట్టే వరకు అరచేతి లో గుండెలు పెట్టుకొని ఏ క్షణం ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో అని బిక్కిబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. చివరకి పసి మొగ్గలను కూడా చిదిమేస్తున్నారు కామాంధులు.

ఇకపోతే , తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ఘటన సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉంది. ఒక ముక్కుపచ్చలారని మైనర్ బాలికపై 74 ఏళ్లు వృద్దుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నేరేడ్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు చూస్తే ..తన ఇంటి చుట్టుపక్కల ప్రాంతంలో నివశిస్తోన్న మైనర్ బాలికపై కన్నేసిన ఆ వృద్ధుడు, ఆమె ఆడుకుంటోన్న సమయం లో మాయ మాటలు చెప్పిన యూసఫ్ అనే వృద్దుడు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..అంబేద్కర్‌నగర్‌ ప్రాంతంలో నివాసముంటున్న హైదర్‌ యూసఫ్‌ రోజు కూలీగా పనిచేస్తున్నాడు. కాగా, ఈ శుక్రవారం రోజున అదే కాలనీలో ఆడుకుంటున్న ఓ బాలికను ట్రాప్ చేసి ఆ అమ్మాయి పై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ తరువాత బాలిక ఇంట్లో జరిగిన విషయం మొత్తం చెప్పడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు హైదర్‌ యూసఫ్‌ ను అరెస్ట్‌ చేసిన పోలీసులు అతడి పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Tags:    

Similar News