తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి విజయం సాధించడంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ ఈ రోజు (శుక్రవారం) ప్రమాణస్వీకారం చేశారు. స్టాలిన్ తోపాటు 34 మంది మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు. స్టాలిన్ క్యాబినెట్‌లో ఇద్దరు మహిళలు, ఇద్దరు మైనారిటీలకు చోటు దక్కింది. ఆర్థికశాఖను పీడీఆర్ పళనివేల్ త్యాగరాజన్ కు, ఆరోగ్యశాఖను సైదాపేట ఎమ్మెల్యే సుబ్రమణ్యంలకు అప్పగించారు. కరోనా కారణంగా స్టాలిన్ ప్రమాణస్వీకారం నిరాడంబరంగా జరిగింది.
సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కొద్ది నిమిషాలలోనే ఎంకే స్టాలిన్ ఐదు ముఖ్యమైన ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇందులో కుటుంబాలకు ఆర్థిక సహాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే, పాల ధరల తగ్గింపు, కరోనా ఆర్ధిక సహాయం నాలుగు వేల రూపాయలు వంటి పథకాలు కూడా ఉన్నాయి. ఈ ఉత్తర్వులలో కొన్ని అసెంబ్లీ ఎన్నికలకోసం డీఎంకే విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలని అమల్లోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేశారు. కరోనావైరస్ మహమ్మారి కింద ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కల్పించడానికి ఎంకే స్టాలిన్ ఐదు ఉత్తర్వులపై సంతకం చేశారు.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంతకం చేసిన మొత్తం ఐదు ఆదేశాలని ఒకసారి చూస్తే ..
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అన్ని బస్సుల్లో మహిళలు అన్ని ఉచితంగా ప్రయాణించవచ్చని సీఎం తెలిపారు. దీనికోసం రూ.1,200 కోట్ల రూపాయలను సబ్సిడీగా విడుదల చేసింది ప్రభుత్వం.
ఎన్నికల్లో డీఎంకే ఇచ్చిన కీలక హామీ, పాల ధరల తగ్గింపు. ఈ మేరకు ప్రభుత్వ అధీనంలోని డెయిరీ సంస్థ ఏవియన్ పాలపై లీటరుకు రూ.3 తగ్గించే ఉత్తర్వులపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతకం చేశారు.
కరోనా కారణంగా ఇబ్బందులెదుర్కొంటున్న పేదలకు రూ.4 వేలు ఇస్తామనే పార్టీ హామీ మేరకు, రేషన్ కార్డుదారులకు తక్షణం రూ.2000 అందించాలని నిర్ణయించారు. దీనితో రాష్ట్రంలోని 2,07,67,000 మంది పేదలకు లబ్ధి చేకూరనుంది. మిగిలిన 2వేలను త్వరలోనే ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్స తీసుకునే వారికి ప్రభుత్వ భీమా పథకం వర్తింపచేయనున్నట్లు ప్రకటించారు స్టాలిన్. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులపై సంతకం చేశారు.
డీఎంకే ఇచ్చిన మరో ముఖ్యమైన హామీల్లో ఒకటైన మీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి” పథకానికి స్టాలిన్ శ్రీకారం చుట్టారు. దీనికింద ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వీకరించిన ప్రజా సమస్యల తాలూకు పిటిషన్లను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు పరిష్కరించనున్నారు.