నవ మాసాలు తల్లి గర్భంలో ఉండాల్సిన శిశువు.. అనుకోని ఆరోగ్య సమస్యల కారణంగా బయటకు రావాలంటే ఎంత కష్టం? అలాంటి కష్టమే ఒక నవజాత శిశువుకు వచ్చింది. అయితే.. కంటికి రెప్పలా చూసుకున్న ఆసుపత్రి సిబ్బంది పుణ్యం కావొచ్చు.. మరేదైనా అద్భుతం కానీ.. ఆ శిశువు ఆరోగ్యంగా ఉండటం ఇప్పుడు అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. నెలలునిండకుండానే.. ఇంకా చెప్పాలంటే కేవలం 26.5 వారాల వయసులో అమ్మ పొట్టలో నుంచి బయటకు వచ్చిన శిశువు బరువు కేవలం 631 గ్రాములేనట.
యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ లోని అబుదాబిలో చోటు చేసుకున్న ఈ అరుదైన ఘటనలో.. నవజాత శిశువు పుట్టినప్పుడు ఆమె బరువు ఐప్యాడ్ బరువుతో సమానం. ఆ పాపను ఆసుపత్రి సిబ్బంది ప్రత్యేక సంరక్షణలో పెంచుతున్నారు. గర్భ సంబంధమైనసమస్యల కారణంగా.. ఆపరేషన్ నిర్వహించి.. నెలలు నిండకుండానే శిశువు తల్లికి ఆపరేషన్ చేసి.. తల్లికి.. బిడ్డకు ప్రాణం పోశారు.
అబుదాబిలోని ది మీడియర్ అనే ఆసుపత్రిలో డాక్టర్ గోవిందా షెనాయ్ నేతృత్వంలో ఆపరేషన్ నిర్వహించి నవజాత శిశువును సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం పలు జాగ్రత్తలు తీసుకోవటంతో ప్రస్తుతం ఆ పాప బరువు రెండు కిలోలకు పెరిగింది. పుట్టినప్పుడు పసిగుడ్డుగా చూసిన ఆసుపత్రి సిబ్బంది ఇప్పుడా పాపను చూసి విస్మయానికి గురి అవుతున్నారు. అద్భుతాలు ఎక్కడో జరిగినట్లు వినేవారికి.. తమ దగ్గరే ఒక అద్భుతం పురుడు పోసుకోవటం.. అత్యద్భుతంగా రికవరీ కావటంతో ఆ బేబీని చూసి మురిసిపోతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/