వికిపీడీయాలో ఆ సీఎం పేరు మార్చేశారు!

Update: 2015-11-05 12:55 GMT
గోమాంసం.. మ‌త అస‌హ‌నం లాంటి వ్య‌వ‌హారాల‌తో చిత్ర‌విచిత్ర‌మైన ప‌రిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్య‌వ‌హారంలో ఎప్పుడూ వార్త‌ల్లో ఉండే వారి ద‌గ్గ‌ర నుంచి ఎప్పుడూ వార్త‌ల్లో ఉండ‌ని వారి వ‌ర‌కూ చాలామందే వార్త‌ల్లోకి.. వివాదాల్లోకి వ‌చ్చేశారు. రాజ‌కీయ నాయ‌కులు మొద‌లు.. క‌వులు.. క‌ళాకారులు.. సినిమా న‌టులు..సెల‌బ్రిటీలు ఇలా చాలామందే ఈ విష‌యంలోకి వ‌చ్చేశారు.

దేశంలో మ‌త అస‌హ‌నం ఎంత ఉందో కానీ.. ప్ర‌ముఖుల మాట‌ల మంట‌ల‌తో మ‌రింత వేగంగా రాజుకున్న ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. ఈ మ‌ధ్య‌నే ఈ అంశంలోకి క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య సైతం ఎంట‌రై తాను ఇప్ప‌టివ‌ర‌కూ గో మాంసం తిన‌లేద‌ని.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తిన‌టానికైనా తాను సిద్ధ‌మ‌ని చెప్ప‌టం సంచ‌ల‌నం సృష్టించింది. ఇదిలా ఉంటే.. సిద్ద‌రామ‌య్య నోటి నుంచి ఈ వ్యాఖ్య‌లు వ‌చ్చిన వెంట‌నే.. బీజేపీ నేత ఒక‌రు సిద్ధ‌రామ‌య్య త‌ల‌ను న‌రికేస్తానంటూ భీక‌ర వ్యాఖ్య చేయ‌గానే.. ఈ వ్య‌వ‌హారం ఒక్క‌సారి హైపిచ్ కి వెళ్లింది.

అవ‌స‌ర‌మైతే గోమాంసం తింటా అన్న మాట‌కే త‌ల తీసేస్తారా? అంటూ విరుచుకుప‌డిన వాళ్లు ఎంత‌మందో.. అస‌లీ వివాదంలోకి త‌ల‌దూర్చ‌టం ఎందుకు? రెచ్చ‌గొట్టేలా మాట్లాడ‌టం ఎందుకంటూ సిద్ద‌రామ‌య్య మీద విమ‌ర్శ‌లు కురిపించినోళ్లు ఉన్నారు. ఇదిలా ఉంటే.. సిద్ధ‌రామ‌య్య మీద త‌మ‌కున్న కోపాన్ని ఒక ఆగంత‌కుడు చిత్రంగా తీర్చుకున్నాడు. వికీపీడియాలో సిద్ధ‌రామ‌య్య పేరు మీదున్న పేజీని శ్యామూల్ గా మార్చేశాడు. గోమాంసం తింటాన‌ని అన్న కొద్దిసేప‌టికి ఇలా జ‌ర‌గ‌టంపై ప‌లువురు ఖండిస్తున్నారు. ఈ విష‌యాన్ని గుర్తించిన అధికారులు.. వీకీపిడియా ఆడ్మినిస్ట్రేష‌న్ కు సమాచారం అందించ‌టంతో పేరును మార్చేశారు. మ‌త అస‌హ‌నం వ్య‌వ‌హారంలో దేశంలో ఎంత అస‌హ‌నం ఉంద‌న్న‌ది ప‌క్క‌న పెడితే సోష‌ల్ మీడియాలో మాత్రం భారీగా ర‌చ్చ జ‌రుగుతుంద‌న్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News