కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్న మొన్నటి వరకూ సాదాసీదా వ్యక్తి కాస్తా ఇప్పుడు బిజీగా మారిపోయింది. క్యాలెండర్లో డేట్ మారే కొద్దీ ఆమె ఉండే ప్లేస్ మారిపోయే తీరు చూస్తే ఆశ్చర్యపోవటం ఖాయం. సుదీర్ఘ కాలం తర్వాత దేశానికి మిస్ వరల్డ్ విజేతగా నిలిచి 130 కోట్లకు పైగా భారతీయులకు సంతోషాన్ని పంచారు హర్యానాకు చెందిన మానుషి చిల్లర్.
జీఈ సమ్మిట్ లో భాగంగా నిన్న రాత్రి తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన విందునకు హాజరైన మానుషీ.. సందడి చేశారు. నిన్నటి తెలంగాణ రాష్ట్ర విందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆమె.. పొద్దున అయ్యేసరికి దేశ రాజధానిలో ఉన్నారు. దేశ ప్రధానిని కలుసుకునేందుకు ఢీల్లీ వచ్చిన ఆమె.. తన పేరెంట్స్ తో కలిశారు. ప్రధానిని కలవటానికి కాస్త ముందుగా ఆమె సోషల్ మీడియాలో స్పందించారు.
తానెంతగానో ఎదురుచూసే వ్యక్తి సమక్షంలో ఉండటం తనకెంతో స్ఫూర్తినిచ్చే అంశంగా చెప్పుకున్న ఆమె.. ప్రధానిని కలవటం తనకెంతో గౌరవంగా ఉందని పేర్కొన్నారు.
పెద్దగా హడావుడి లేకుండా తెల్లటి అనార్కటి చుడీదార్ ధరించిన ఆమె ప్రధాని మోడీని కలిశారు. ఈ సందర్భంగా మిస్ వరల్డ్ కిరీటాన్ని సాధించినందుకు మానుషికి మోడీ అభినందనలు తెలిపారు. మోడీని కలవటానికి కాస్త ముందుగా మానుషి కాసిత ఉద్వేగానికి గురి కావటం గమనార్హం.