ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఈటలకు తప్పిన పెను ముప్పు !

Update: 2021-06-15 06:30 GMT
తెలంగాణ రాష్ట్రానికి చెందిన కీలకనేత , మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కు కొద్దిలో పెను ప్రమాదం తప్పింది. ఈటల బృందం ఢిల్లీ నుంచి వస్తున్న విమానంలో సాంకేతిక సమస్య చోటు చేసుకుంది. దీనితో వెంటనే  పైలట్‌ అలెర్ట్‌ అవ్వటంతో పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్‌ సమయంలో సాంకేతిక సమస్యను పైలట్‌ గుర్తించడం తో ఎటువంటి ప్రమాదం లేకుండా అయన , అయన బృందం బయటపడ్డారు. ఆ తర్వాత  ఢిల్లీ నుంచి మరో స్పెషల్ విమానంలో ఈటల బృందం బయల్దేరింది. సోమవారం ఢిల్లీలో ఈటల లాంఛనంగా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

ఈటల బృందం నేడు తిరిగి రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. ఈ సమయంలో ఈ ఘటన జరిగింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘనందన్, వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి,తుల ఉమాతో పాటు విమానంలో మొత్తం 184 మంది ఉన్నారు. మరోవైపు ఈరోజు హైదరాబాద్ చేరుకున్న తర్వాత నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి మొదటసారి ఈటల రాజేందర్ వెళ్లనున్నారు. ముఖ్యనేతలతో మాజీమంత్రి ఈటల సమావేశం కాబోతున్నారు.

ఇక ఇదిలా ఉంటే ..  ఈటలకి పార్టీ సభ్యత్వం ఇచ్చి కండువా కప్పి BJPలోకి ఆహ్వానించారు కేంద్ర మంతి ధర్మేంద్ర ప్రదాన్. ఈటల రాజేందర్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ, గండ్ర నళిని, అశ్వద్ధామ రెడ్డి కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. టీఆర్ఎస్‌కి దూరమైనప్పటి నుంచి ఈటల వేస్తున్న ప్రతి అడుగునూ టీఆర్ఎస్ పార్టీ నేతలు గమనిస్తూనే ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యగానే, ఈటలపై విమర్శల దాడి  మొదలుపెట్టారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత తమ కేడర్ చెక్కుచెదరలేదని భావిస్తున్న టీఆర్ ఎస్  కి ఈటల చేరికతో బలంగా పోరాడే అవకాశం దక్కిందని బీజేపీ భావిస్తోంది. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారబోతోంది. ఈ ఎన్నికలో బీజేపీని ఓడించి, ఇక తెలంగాణలో తమకు తిరుగు లేదు అని చెప్పుకోవాలని టీఆర్ ఎస్ లెక్కలేస్తోంది. అదే, బీజేపీ గెలిస్తే టీఆర్ ఎస్ పని అయిపోయింది అని ప్రచారం చేసేందుకు తమకు వీలవుతుందని బీజేపీ భావిస్తోంది. ఇలా హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎలా ఉండబోతోంది అనేది రెండు పార్టీలకూ సవాలుగా మారనుంది
Tags:    

Similar News