పోలండ్ పై క్షిపణి దాడి చిచ్చు.. మూడో ప్రపంచ యుద్ధ భయాలు?

Update: 2022-11-16 12:30 GMT
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు విస్తరించినట్టే కనిపిస్తోంది. ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల వర్షం కురిపించింది. ఈరోజు జరిపిన దాడుల్లో ఒక క్షిపణి వెళ్లి ఉక్రెయిన్ పక్కనున్న నాటో దేశమైన పోలండ్ పై పడింది. అక్కడ శివారు గ్రామంలోని ఓ ఇంటిపై పడడంతో ఇద్దరు పోలండ్ పౌరులు మరణించారు. నాటోలో సభ్యదేశమైన పోలండ్ పై క్షిపణి దాడి చేసింది రష్యా అని ఉక్రెయిన్ ఆరోపిస్తుంటే .. అది ఉక్రెయిన్ క్షిపణి అని రష్యా వాదిస్తోంది.

ఈ క్రమంలోనే జీ20 సమావేశాల్లో ఉన్న అమెరికా, యూరప్ దేశాల అధ్యక్షులు వెంటనే సమావేశమయ్యారు. దీనిపై సీరియస్ గా చర్చించారు. పోలండ్ కు మద్దతుగా నాటో కూడా యుద్ధంలోకి దిగితే యూరప్ దేశాలు వర్సెస్ రష్యా యుద్ధంగా మారడం ఖాయం. అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి తెరతీసినట్టే.

ఈ క్షిపణి దాడికి రష్యాను బాధ్యులను చేయాలని నాటో భావిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే రష్యాపై దాడికి నాటో దేశాలు సిద్ధమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. అప్పుడు అది అంతిమంగా మూడో ప్రపంచ యుద్ధానికి కారణమవుతుందనే భయాలు మొదలయ్యాయి.

పోలండ్ పై క్షిపణి దాడి తర్వాత నోటో కూటమిలోని దేశాల నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది.గతంలో జరిగిన ప్రపంచ యుద్ధాలకు ఇలాంటి చిన్న చిన్న ఘటనలే కారణం. వాటిని ఆయా దేశాలు సీరియస్ గా తీసుకొని యుద్ధాల మొదలుపెట్టి ప్రపంచమంతా యుద్దానికి దిగాల్సి వచ్చింది.  ఇప్పుడు పోలండ్ పై క్షిపణి దాడి ఘటన కూడా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలుపెట్టి 8 నెలలు కావస్తోంది. ఇది ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదు. నాటో, ఐరాస సహా పలు అంతర్జాతీయ సంస్థలు ఆంక్షలు విధిస్తున్నా రష్యా వెనక్కి తగ్గడం లేదు. నాటో దేశాలు దాడికి మొ్గు చూపితే మూడో ప్రపంచ యుద్ధం రావడం ఖాయం. అమెరికా, యూరప్ నోటో దేశాలు రష్యాపై దాడికి దిగితే ప్రపంచమంతా విడిపోయి కొట్టుకునే పరిస్థితి రావచ్చు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News