తెలంగాణలో పెరుగుతున్న మిస్సింగ్ కేసులు..నాలుగురోజుల్లో 203 మంది మిస్సింగ్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకి మిస్సింగ్ కేసుల నమోదు భారీగాపెరిగిపోతుంది. గత నాలుగు రోజుల్లో తెలంగాణలో సుమారుగా 203 మంది అదృశ్యం అయినట్లు మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ వివరాలన్నీ పోలీసుల అధికారిక వైబ్ సైట్ లో మిస్సింగ్ కేసుల వివరాలు ఉన్నాయి. అలాగే , బుధవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 65 మంది వ్యక్తులు అదృశ్యం అయినట్లు పోలీసులు తెలిపారు. ఒక్క బుధవారం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 13 మంది, సైబరాబాద్ పరిధిలో 11 మంది, రాచకొండ పరిధిలో 8 మంది తప్పిపోయినట్లు కేసులు నమోదయ్యాయి. ఈ నెల 26న 65 మిస్సింగ్ కేసులు, 27వ తేదీన 62 కేసులు, 28వ తేదీన 65 కేసులు, 29న 11 మంది మిస్సింగ్ కేసులు నమోదైనట్లు వెబ్ సైట్ లో వెల్లడించారు.
అయితే , వివిధ కారణాలతో ఇళ్ల నుంచి వెళ్లిపోతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టిసారించినట్లు పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు. నేరాల నియంత్రణలో నిత్యంబిజీ గా వున్న పోలీసులకు మిస్సింగ్ కేసులు పెను సవాల్ గా మారుతున్నాయి. మిస్సింగ్ కేసులు పోలీసులను తలలు పట్టుకునేలా చేస్తున్నాయి. ఆ కేసులు మిస్టరీగానే మిగిలి పోతున్నాయి. ఏటా నమోదయ్యే మిస్సింగ్ కేసుల్లో దాదాపు 85 శాతం కేసులు పోలీసులు పరిష్కరిస్తున్నా.. 15 శాతం కేసులు తేలకుండానే పోతున్నాయి. గతేడాది రాష్ట్రంలో నమోదైన మిస్సింగ్ కేసుల్లో 3,418 కేసులు ఇంకా ట్రేస్ అవుట్ కాలేదు. ఇందులో 655 మంది మైనర్ల ఆచూకీ లభించలేదు. ఇలా పెండింగ్‌లో ఉన్న కేసులను సీఐడీకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు పోలీసులు.
ఇటీవలే మహబూబాబాద్, శామీర్‌పేట్ మైనర్ల కిడ్నాప్, మర్డర్ కేసులతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పోలీస్ స్టేషన్ లలో నమోదైన మిస్సింగ్ కేసులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ ఏడాదిలో ఈ నెల26 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,282 మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి. పోలీసులు చాలా మిస్సింగ్ కేసులను దర్పణ్ యాప్ తో ట్రేస్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా రిజిస్టరైన డాటాబేస్ తో ఆధారంగా చైల్డ్ హోమ్స్, గుర్తు తెలియని డెడ్ బాడీలను ఫేషియల్ రికగ్నేషన్, దర్పణ్ యాప్‌తో పరిశీలిస్తారు. మ్యాచింగ్ ఫొటోస్ ఆధారంగా సంబంధిత పోలీసులకు సమాచారం అందిచి దర్యాప్తు చేస్తున్నారు.