పోలీసుల్ని పరుగులు పెట్టించిన మౌనిక అలా దొరికింది?

Update: 2019-12-02 08:45 GMT
అన్ని కథలు ఒకేలా ఉండవు. తమను వేధింపులకు గురి చేస్తున్నారంటూ యువతులు చేసే ఫిర్యాదుల్లో అన్ని నిజాలే ఉండవు. కొన్ని పందొమ్మిదేళ్ల మౌనిక మాదిరి కూడా ఉంటాయి. తాజాగా వెల్లడైన ట్విస్టులు చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. గడిచిన కొద్ది రోజులుగా పోలీసులకు చెమటలు పట్టించిన ఈ ఉదంతం గురించి వింటే ఒళ్లు మండక మానదు. ఎందుకంటే.. తమ స్వార్థం కోసం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించటం ఎంతవరకు సమంజసం అన్న సందేహం రాక మానదు.

నిజామాబాద్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల మౌనిక హైదరాబాద్ లోని నారాయణగూడలోని ఒక హాస్టల్ లో ఉంటోంది. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఆమె.. గత మంగళవారం (నవంబరు 26న) రాత్రి ఆమె తండ్రి ఫోన్ చేసిన సమయంలో ఒక యువకుడు వెంటపడి వేధిస్తున్నట్లు చెప్పింది. దీంతో ఆయన అనుయనించి.. ధైర్యం చెప్పారు. వెంటనే తన కొడుకును పంపారు.

అతగాడు హాస్టల్ కు వచ్చి చూస్తే.. తాను వేధింపులు తట్టుకోలేకపోతున్నానని.. ట్యాంక్ బండ్ లో పడి ఆత్మహత్య చేసుకుంటానని రాసి ఉన్న లేఖను ఆమె రూం నుంచి సేకరించారు పోలీసులు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చాడు మౌనిక సోదరుడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను రక్షించటం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆమె ఆచూకీ లభించకపోవటంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో మౌనిక ఆచూకీ కోసం విపరీతంగా శ్రమించారు.

కనిపించకుండా పోయిన ఆమె గురించి తెలుసుకోవటం  కోసం పలు మార్గాల్లో వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఆమె ఫోన్ నెంబరు పని చేయటం లేదు. ఇలాంటివేళ.. ఆమెను వేధింపులకు గురి చేస్తున్న యువకుడు కూడా కనిపించటం లేదన్న విషయాన్ని గుర్తించారు. దీంతో వీరికి చెందిన స్నేహితుల్ని విచారించిన పోలీసులు వారి కొత్త నెంబర్లను గుర్తించారు.

ఆ నెంబర్ల కాల్ డేటా ఆధారంగా వారిద్దరూ గుంటూరులో ఉన్నట్లు గుర్తించారు. ఇంతకీ విషయం ఏమంటే.. మౌనిక.. ఆ కుర్రాడు ప్రేమించుకున్నారు. అయితే.. ఆ కుర్రాడు మైనరే. డిసెంబరు 3న అతడు మేజర్ అవుతాడు. తెర మీదకు రాని కారణాలు ఏమైనా సరే.. ఇలా నాటకం ఆడి కనిపించకుండా పోయి అతగాడు మేజర్ అయ్యాక బయటకు వద్దామని అనుకున్నారు. ఈ విషయమంతా విన్న పోలీసులు అవాక్కు అయ్యే పరిస్థితి. బాధితురాలికి ఏదో జరుగుతుందన్న సందేహంతో కిందామీద పడిపోతే.. ఆమె మాత్రం అందుకు భిన్నమైన ట్విస్టును రివీల్ చేసి పోలీసులకు షాకిచ్చారని చెప్పక తప్పదు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కొందరు బాధితుల విషయంలో పోలీసులు సరిగా స్పందించకపోతే మొత్తం పోలీసు శాఖను తప్పు పట్టేవారు.. మరి ఇలాంటి ఉదంతాల మీద ఎలా రియాక్ట్ అవుతారు?


Tags:    

Similar News