మిషన్ 144 : ఈ డిసెంబర్‌లో హైదరాబాద్‌లో మొదలుపెట్టనున్న బీజేపీ

Update: 2022-12-10 12:30 GMT
ఇటీవల జరిగిన జాతీయ కార్యవర్గం తర్వాత హైదరాబాద్‌లో మరోసారి బీజేపీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సంతోష్, తెలంగాణ ఇన్ ఛార్జి సునీల్ బన్సాల్ వంటి అగ్రనేతలు హాజరుకానున్నారు. బీజేపీ బలహీనంగా ఉన్న 144 పార్లమెంటరీ నియోజకవర్గాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో  బీజేపీ  బలహీనంగా ఉన్న 144 స్థానాలను గుర్తించింది. 2024 ఎన్నికల్లో పార్టీ పనితీరును మెరుగుపరుచుకోవడానికి ఈ మేరకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.  వీటిలో ఎక్కువ సీట్లు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు కేరళ వంటి దక్షిణ భారత రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ ప్రతి నియోజకవర్గానికి నియమించబడిన బాధ్యులు ఈ సమావేశంలో పాల్గొంటారు.

ఈ నియోజకవర్గాల బాధ్యులైన బీజేపీ నేతల శిక్షణా శిబిరం డిసెంబర్ 28 ,29 తేదీలలో నిర్వహించబడుతుంది.. పార్టీ శిక్షణా కార్యక్రమంలో 2019 ఎన్నికలలో బిజెపి పనితీరు ఈ 144 బలహీన నియోజకవర్గాలకు అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి పెడుతుంది. గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ ప్లాన్ చేస్తున్న రెండో ప్రధాన కార్యక్రమం ఇది.

గుజరాత్‌లో పోలింగ్ పూర్తయిన ఒకరోజు తర్వాత డిసెంబర్ 6న తొలి సమావేశం జరిగింది. డిసెంబరు 6, 7 తేదీల్లో రెండు రోజుల పాటు ఢిల్లీలో పార్టీ ఎన్నికల కోర్ టీమ్ సమావేశమైంది. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నిర్వహిస్తున్న రెండో పెద్ద కార్యక్రమం ఇది. దీన్నిబట్టి బీజేపీ ఎన్నికల యంత్రాంగాన్ని ఎంత బాగా పవర్ ఫుల్ గా మార్చుతుందో అర్థం చేసుకోవచ్చు.  2024 ఎన్నికలకు ఎంత సమర్ధవంతంగా ప్రణాళికబద్దంగా వారు సన్నద్ధమవుతున్నారో అర్థమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News