వీళ్ల ప్రైజ్ మ‌నీ వింటే క‌ళ్లు తేలేస్తారు !

Update: 2018-06-05 12:23 GMT
ఆసియా కప్ మహిళల టీ20 క్రికెట్ టోర్నమెంట్‌ లో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజ‌యం సాధించింది. అంత‌ర్జాతీయ స్థాయి మ్యాచ్ ల‌లో వ‌ర‌స‌గా రెండో సారి విజ‌యం - అదీ క్రికెట్ లో అంటే వారికి ఎంత ప్రైజ్ మ‌నీ వ‌స్తుందా అని అంతా ఆశ్చ‌ర్యంగా ఎదురుచూస్తాం. ఎందుకంటే అంత‌ర్జాతీయ స్థాయిలో క్రికెట్ లో ఒక్క మ్యాచ్ లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసినా ఆయా క్రీడాకారుల చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలుస్తుంది. ఒక్క బాల్ - ఒక్క క్యాచ్ - ఒక్క ర‌నౌట్ తో మ్యాచ్ లు తారుమారు అవుతుంటాయి. ఆట‌గాడి స‌మ‌య‌స్ఫూర్తి అక్క‌డే బ‌య‌ట‌ప‌డుతుంది. అందుకే ఏ మ్యాచ్ లో ఉత్త‌మ ఆట‌గాడిక‌యినా భారీ పారితోషికం ఇచ్చి ప్రోత్స‌హిస్తుంటారు.

ఆసియా కప్ మహిళల టీ20 క్రికెట్ టోర్నమెంట్‌ లో మలేషియాతో మ్యాచ్‌ లో మిథాలీరాజ్ - థాయ్‌ లాండ్‌ తో మ్యాచ్‌ లో హర్మన్‌ప్రీత్ కౌర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. దీంతో వారికి ప్రైజ్ మ‌నీ రూపంలో కేవ‌లం 250 అమెరిక‌న్ డాల‌ర్లు (మ‌న క‌రెన్సీలో రూ.16,778) చెల్లించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ).

మామూలు ఐపీఎల్ మ్యాచ్ ల‌లో బెస్ట్ క్యాచ్ - బెస్ట్ ఫీల్డ‌ర్ - బెస్ట్ బౌల‌ర్ - బెస్టు బ్యాట్స్ మెన్ కు రూ.ల‌క్ష‌కు త‌గ్గ‌కుండా చెక్ అందిస్తున్నారు. మ‌రి అంత‌ర్జాతీయ స్థాయి మ్యాచ్ ఇంత దారుణంగా కేవ‌లం రూ.16,778 చెల్లించ‌డం ఏంట‌ని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. అన్నింటా స‌గం అని ఆద‌ర్శాలు వ‌ల్లిస్తుంటారు. కానీ అంత‌ర్జాతీయ స్థాయి సంస్థ అయిన ఐసీసీ మ‌హిళా క్రీడాకారుల ప‌ట్ల వివ‌క్ష ప్ర‌ద‌ర్శించ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.


Tags:    

Similar News