రీల్ స్వామీజీ ఎంపీ పదవికి రాజీనామా

Update: 2016-12-26 14:43 GMT
అలనాటి బాలీవుడ్ సంచలనం.. డిస్కోడ్యాన్స్ ర్ గా చెలరేగిపోయి నాటి యూత్ కి తన యాక్టింగ్ తో కిక్కు ఎక్కించిన హీరో మిథున్ చక్రవర్తి. ఆయనంటూ తెలీని సినీ అభిమాని ఉండరు. తెలుగులో గోపాల గోపాల చిత్రంలో స్వామీజీ పాత్రను పోషించి.. తన విలక్షణ నటనతో ఆ పాత్రను ప్రేక్షకుల మదిలో ముద్ర వేశారని చెప్పాలి. ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.

పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉక్కిరిబిక్కిరి చేసిన శారదా కుంభకోణంలో మిథున్ చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కోవటంతో పాటు.. ఈడీ నుంచి నోటీసులు పొందారు. అయితే.. శారదా కుంభకోణం వెలుగు చూసిన తర్వాత.. ఆరోపణలు ఎదుర్కొంటూ.. తిరిగి డబ్బుల్ని ఈడీకి పంపిన వారు ఎవరైనా ఉన్నారంటే అది మిథున్ చక్రవర్తి మాత్రమే.

తనకు అందిన నోటీసుల అనంతరం స్వచ్ఛందంగా రియాక్ట్ అవుతూ రూ.1.19కోట్ల ఈడీని తన లాయర్ ద్వారా పంపారు. అనంతరం ఆయన రాజ్యసభ సమావేశాలకు హాజరు కాకుండా ఉంటున్నారు. తాజాగా తన పదవికి రాజీనామా చేసిన ఆయన.. తన ఆరోగ్యం సరిగా లేనందుకే రాజీనామా చేశానని.. ఇందులో రాజకీయ కోణం ఏమీ లేదని పేర్కొన్నారు. ఏమైనా.. మిథున్ చక్రవర్తి రాజీనామా వార్త ఇప్పుడు రాజకీయ పక్షాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News