ప్రధాని నరేంద్రమోడీ పాకిస్థాన్ పర్యటన రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మోడీ పాకిస్తాన్ సడెన్ సర్ ప్రైజ్ విజిట్ ఆయా దేశాల నాయకులకు ఆశ్చర్యానికి గురిచేయగా...దేశంలోని ఆయా రాజకీయపార్టీలు భిన్నంగా స్పందించాయి. ఈ క్రమంలో కాషాయం అంటేనే విరుచుకుపడే కమ్యూనిస్టులు మాత్రం మోడీ నిర్ణయాన్ని అభినందించారు. మోడీ పర్యటనపై ఆయా నేతల స్పందనలు..
- పాకిస్తాన్ లో మోడీ పర్యటనను విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రస్తుతించారు. ఆ నిర్ణయం తీసుకోవడంలో ఆయన రాజనీతిజ్ణుడిగా వ్యవహరించారు. పొరుగుదేశాలతో సంబంధాలు ఎలా ఉండాలో మోడీ తన చేతల ద్వారా చూపారని సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు.
-ప్రధాని నరేంద్రమోడీ పర్యటనను భారత్-పాకిస్థాన్ ల మధ్య చర్చల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ పర్యటన ఎంతగానో దోహదపడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా అన్నారు. ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియలో ఏర్పడిన ప్రతిష్టంభన విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్థాన్ పర్యటనతో తొలగిపోగా.,..ఇప్పడు మోడీ పర్యటనతో చర్చల ప్రక్రియ కొనసాగింపునకు దోహదపడుతుందని చెప్పారు.
-ప్రధాని పాకిస్థాన్ పర్యటనను ఒక దుస్సాహసంగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. ఇంతటి ముఖ్యమైన అంశం గురించి ట్వీట్ ద్వారా దేశానికి తెలియజేయడాన్ని తప్పుపట్టింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు రెండు రోజుల కిందటే ముగిసినప్పటికీ...తన పాక్ పర్యటన గురించి పార్లమెంటులో మోడీ ప్రకటించకపోవడం ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమేనని కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ విమర్శించారు. దేశాన్ని, ప్రజలను, పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ పర్యటన వల్ల జాతీయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
- ప్రధాని నరేంద్ర మోడీ హఠాత్తుగా పాకిస్థాన్ లో పర్యటించడం తమను షాక్ కు గురి చేసిందని జేడీయూ పేర్కొంది. సరిహద్దుల్లో పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పొరుగుదేశంలో తన పర్యటన గురించి మాటమాత్రమైనా దేశానికి తెలియజేయకుండా హఠాత్తుగా నిర్ణయం తీసుకుని ట్వీట్ చేయడాన్ని ఆ పార్టీ తప్పుపట్టింది. పార్లమెంటును, రాజకీయ పార్టీలను విశ్వాసంలోనికి తీసుకోకపోవడం దారుణమని విమర్శించింది.